S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంచి( సండేగీత)

ఆ మధ్య సూపర్ మార్కెట్‌లో ఓ గమ్మతె్తైన సంఘటన జరిగింది.
కూరగాయలు వున్న ప్రదేశంలో ఓ పెద్ద ప్లాస్టిక్ కవర్‌ల చుట్ట ఉంటుంది. అందులో నుంచి ఓ కవర్‌ని చించుకొని ఒక్కో కూరగాయలని ఒక్కో కవర్లో వేసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి చాలామంది వెళతారు. కానీ ఓ వ్యక్తి తాను తెచ్చుకున్న బట్టసంచీలో కూరగాయలని వేసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వెళ్లాడు. అతని వెనుక ఓ వ్యక్తి, ఆ తరువాత నేను క్యూలో నిల్చున్నాం.
అప్పటిదాకా స్పీడ్‌గా నడిచిన క్యూ ఆ బట్టల సంచీలో కూరగాయలని వేసుకున్న వ్యక్తి బిల్లింగ్ దగ్గరకు రాగానే ఆలస్యం అవడం మొదలైంది. అతను కొన్న కూరగాయలని బరువు తూచి బిల్ చేయడంలో ఆలస్యం జరుగుతోంది.
ఆయన వెనక క్యూలో ఉన్న వ్యక్తిలో అసహనం మొదలైంది. చివరికి వుండబట్టలేక అన్నాడు.
‘మా మాదిరిగా ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వస్తే త్వరగా బిల్లింగ్ అయ్యేది కదా’ అన్నాడు.
‘మీరన్నది నిజమే! నేను ప్లాస్టిక్ సంచులు వాడను సార్!’ అని వినయంగా జవాబు చెప్పాడు.
‘ఎందుకని..’ అడిగాడు.
‘ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అందుకని నేను ప్లాస్టిక్ వాడను’ జవాబు చెప్పాడు అతను.
కాస్సేపటికి అతని బిల్లింగ్ అయిపోయింది. తన చేతి సంచీని తీసుకొని అతను వెళ్లిపోయాడు.
అతను వెళ్లిపోయిన తరువాత - ఆ చేయిసంచీ వ్యక్తిని పరిశీలించిన వ్యక్తి నా వైపు చూస్తూ-
‘ఈయన ఒక్కడు ప్లాస్టిక్ సంచులు వాడకపోవడం వల్ల ప్రపంచం బాగుపడుతుందా?’ నవ్వుతూ అన్నాడు.
ఈ ప్రపంచం బాగుపడుతుందా అంటే కచ్చితంగా ఎంతో కొంత బాగుపడుతుంది.
ఈ ప్రపంచంలో ఇల్లులేని ప్రతివాడికి మనం ఇంటికి ఇవ్వలేకపోవచ్చు. ప్రతి సమస్యకి పరిష్కారం చూపించలేకపోవచ్చు. ప్రపంచ శాంతిని నెలకొల్పలేకపోవచ్చు. కానీ మన సహాయం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. అతని జీవితంలో అవసరమైన మార్పుని మనం తీసుకొని రావచ్చు. అతను చేస్తున్నది అదే పని. భూమాతకి అతను చేస్తున్న సహాయం అదే! కాదు - మనకి అతను చేస్తున్న సహాయం. అతను నివసిస్తున్న ప్రాంతానికి అతను చేస్తున్న సేవ అది. అతన్ని చూసి ఎవరైనా మారవచ్చు.’
అతనికి ఈ విషయాలు చెబుదామని అనుకున్నాను. కానీ చెప్పలేదు. అతని అభిప్రాయాన్ని ఏకీభవించినట్టు ఫీలింగ్‌ని మాత్రం కలిగించాను.

- జింబో 94404 83001