S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎమోజీ (ఓ చిన్నమాట)

ఆ మధ్య ‘మా వేములవాడ కథల్లో’ ‘ఉత్తరమూ - ఈమెయిలు’ పేరుతో ఓ కథ రాశాను. ఉత్తరం అదృశ్యమై మెయిల్లు ప్రధాన పాత్ర పోషించడం గురించిన ప్రస్తావన ఉంటుంది ఆ కథలో. అంతేకాదు భాష మారిపోయిన వైనాన్ని కూడా ఆ కథలో చెప్పాను. గుడ్‌మార్నింగ్ జిఎన్‌గా పరిణామం చెందిన అంశాలను ఎన్నింటినో అందులో ప్రస్తావించాను. యువత భాషను ఏ విధంగా మార్చేశారోనన్న విషయాన్ని పోస్ట్ఫాస్‌తో వున్న అనుబంధాన్ని కథలో వివరించాను.
ఆ కథ రాసి దాదాపు పది సంవత్సరాలు అవుతోంది. అప్పటికింకా స్మార్ట్ఫోన్లు రాలేదు. మామూలు మొబైల్ ఫోన్లు మాత్రమే వున్నాయి. ఆ తరువాత కొంతకాలానికి స్మార్ట్ఫోన్లు దాదాపు అందరి చేతుల్లోకి వచ్చాయి. ఇప్పుడు భాష పూర్తిగా మారిపోయింది. ఎక్స్‌ప్రెషన్స్ వచ్చేశాయి.
మనుషులు ఆలోచించడం తగ్గించివేస్తున్నారని అన్పిస్తుంది. ఒక చిన్న ‘జమ’ చేయడానికి కూడా స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. అక్షరాల స్థానంలో ‘ఎమోజీ’లు వచ్చేశాయి. ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఎవరైనా కష్టపడి ఏదైనా మెసెజీ రాసి పంపిస్తే ఓ నవ్వుతున్న గుండు ‘ఎమోజీ’తో జవాబు ఇస్తున్నారు. ఎవరైనా ఓ మంచి కవిత రాసి గ్రూప్‌లో పెడితే, లేదా ఎవరైనా మిత్రుడికి పంపిస్తే దానికి జవాబుగా ఓ ‘ఎమోజీ’ వస్తుంది. అదే విధంగా ఎవరైనా అభినందిస్తే ‘నమస్కారం’ వున్న ఎమోజీతో జవాబు వస్తుంది.
ఆలోచించి ఓ రెండు వాక్యాలు రాయడానికి కూడా ఈ రోజు మనుషులు ఇష్టపడటంలేదు. కష్టపడటంలేదు. యువతరమే కాదు. పాతతరం కూడా ఇదే పద్ధతిని అవలంబిస్తుంది. భావం అర్థమవుతుంది కదా అని ఎవరైనా వాదించవచ్చు. అక్షరాలు మన స్వంతం. ఎమోజీలు ఎవరో సృష్టించినవి. మనిషిని ఆలోచించకుండా ఎమోజీలు తయారుచేస్తున్నవి.
ఈ విధంగా అలవాటుపడితే ఆలోచనా శక్తి తగ్గిపోతుందని అన్పిస్తుంది.
టీవీల్లో క్రికెట్‌ని దగ్గరగా చూసినప్పటికన్నా స్టేడియంలో దూరం నుంచి థ్రిల్లే వేరు. పాటలని టీవీల్లో చూడటం వేరు. ప్రత్యక్షంగా చూడటం వేరు. ‘ఫేస్‌టైమ్’లో మాట్లాడటం వేరు. నేరుగా మాట్లాడటం వేరు. ఎమోజీ వేరు. అక్షరాలు వేరు.

- జింబో 94404 83001