S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బీ పాజిటివ్

లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే ఫ్రాన్స్ దేశపు ప్రఖ్యాతి పొందిన సైకిల్ క్రీడాకారుడికి కేన్సర్ వ్యాధి సోకింది. డాక్టర్లు అతడు బతికే అవకాశం నలభై శాతం మాత్రమే ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు, అతడు ఇక మీదట సైకిల్ తొక్కరాదని కూడా హెచ్చరించారు. అతనికి మిన్ను విరిగి మీద పడ్డట్లూ, తనకు మరణమే శరణ్యమన్నట్లూ అనిపించింది. కానీ కొంతకాలం తర్వాత ఈ పరిస్థితిని అధిగమించి, తాను కేన్సర్ విజేతను కావాలనీ, కేన్సర్ వంచితుడు కాకూడదనీ నిశ్చయించుకున్నాడు.
తరువాత రోజుల్లో కొన్నిసార్లు రక్తం కక్కుకునేవాడు. అయినా కూడా ‘పోయింది చాలా తక్కువ రక్తమనీ, దిగులుపడవలసింది ఏమీ లేదని’ తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. కొన్ని సంవత్సరాలకు అతడి కేన్సర్ పూర్తిగా నయమైందని నిర్ధారణ చేశారు. అప్పుడు అతను ఫ్రాన్స్ దేశపు అత్యున్నతమైన సైకిల్ పోటీ ‘టూర్ -డి- ఫ్రాన్స్’లో మరొకసారి పాల్గొని, గెలుపొందాడు.
అతడి జబ్బు నయం కావడాన్ని డాక్టర్లు నమ్మలేకపోయారు. కానీ ఆశావహ దృక్పథంతో పనిచేసే మనస్సు శరీరాన్నీ, దాని రుగ్మతల్ని జయించగలదని అతడు దృఢంగా విశ్వసించడమే అతని రోగం నయమవటానికి కారణం.
ఇదే విధంగా నిబ్బరంతో వ్యవహరించవలసిన సంఘటన ఒకటి ఐఐటి ముంబయిలో జరిగింది. హిమాద్రిపాల్ అనే విద్యార్థి రెండంతస్థుల భవనం నుండి క్రింద పడిపోయాడు. వెనె్నముకలో చాలా వెన్నుపూసలు విరిగిపోయాయి. రెండు కాళ్లూ విరిగాయి. ఒక చేయి కూడా విరిగింది. అతడు మళ్లీ లేచి నిలబడడం, నడవడం అనుమానమేనని డాక్టర్లు తేల్చారు. మానసికంగా చితికిపోయిన హిమాద్రిపాల్ ప్రేరణ కోసం భగవద్గీత చదవసాగాడు. బలహీనతను జయిస్తేనే అభివృద్ధిని సాధించగలమన్నదే భగవద్గీత సందేశసారం.
హిమాద్రిపాల్ తరువాతి రోజులలో తన అనుభూతులను ఇలా వివరించాడు: ‘నేను మళ్లీ నడవలేనన్న ఆలోచన కేవలం నా బలహీనతే అని గ్రహించగలిగాను. ఒకటిన్నర సంవత్సరం తరువాత మొదటి అడుగు వేయగలిగాను. క్రమం తప్పకుండా సాధన చేసి ఐఐటికి తిరిగి రాగలిగాను. ఆశావహ దృక్పథానికి కృతజ్ఞతలు. కానీ ఈ ఆశావహ దృక్పథం ఇన్ని మంచి పనులు సాధించగలదన్న సత్యానికి సశాస్ర్తియమైన నిరూపణ చాలా తక్కువగా ఉన్నట్టు తోస్తుంది!’
నిరాశలో మునిగిపోయిన వారిలో వ్యాధులతో యుద్ధంచేసే తెల్లరక్త కణాలు తక్కువగా ఉంటాయని ప్రయోగశాలల పరీక్షలు రుజువు చేశాయి. మనం ఉన్న మానసిక స్థితి మన రోగనిరోధక వ్యవస్థపై పనిచేస్తుందని ముంబయి నగరానికి చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ రాజేష్ పారిఖ్ చెబుతారు. గాయాలు మానడం, టీకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం - మొదలైన క్రియలను మానసిక ఒత్తిళ్లు అడ్డుకుంటాయని వైద్యపరీక్షలు రుజువు చేశాయి.
ఆశావహంగా ఉండటం ఎలా?
1.మీకు నచ్చే మనుషులు, ప్రదేశాలు, వస్తువులు మొదలైన వాటి జాబితాను తయారుచేసుకోండి. ఒక వేసవి విడిది, ఒక ఐస్‌క్రీం, ఒక పెంపుడు జంతువు - ఇలా ఏదైనా కావచ్చు. మీరు నిరాశలో మునిగిపోయినప్పుడు వీటి మీదకు మీ దృష్టిని మరల్చండి.
2.అలాగే నిరాశ వీడనప్పుడు ‘ఊహూ! ఇలా ఉంటే లాభం లేదు!’ అని మీకు మీరే చెప్పుకోండి. మీ ఆలోచనలను వేరేవైపు మళ్లించండి.
3.ఆ రోజు మీరు సాధించిన పనులను ఐదింటిని గుర్తుకు తెచ్చుకోండి. అవి చాలా చిన్నవే కావచ్చు. అయినా ఫరవాలేదు. ఎందుకంటే ఆ చిన్నచిన్న పనులే క్రమంగా పెద్దపెద్ద కార్యాలవుతాయి.
4.ఇతరులు మిమ్మల్ని ఎప్పుడూ విమర్శిస్తున్నారని అనిపిస్తుంటే, వాటిని కాసేపు పక్కనపెట్టి, మీరు అభినందనలు పొందిన సంఘటనల్ని జ్ఞప్తికి తెచ్చుకోండి.
5.దేని గురించి అయినా సరే ‘అది ఉంటే అన్నీ ఉన్నట్టే, అది లేకపోతే ఏమీ లేనట్టే’ అన్న ధోరణిలో ఆలోచించవద్దు.

-శృంగవరపు రచన 99591 81330