S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలివైన కాకులు

చిన్నప్పుడెప్పుడో చదువుకున్న లేదా పెద్దలద్వారా విన్న కాకి కథ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓ కాకికి దాహం వేసి వెతగ్గా.. వెతగ్గా.. ఓ కుండ కనిపించిందనీ.. దానిలో అడుగున నీళ్లు ఉన్నాయని, కాకి వాటిని తాగాలనే ధ్యేయంతో తెలివైన ఆలోచన చేసి ఒక్కొక్కటిగా గులకరాళ్లను వేసి నీళ్లను పైకి తెచ్చుకుని తాగుతుందనేది కథ. విపత్కర పరిస్థితుల్లో తెలివిగా ఎలా ఆలోచించాలి అనేది కథాసారాంశం. కానీ అప్పుడు కథగా చెప్పుకున్న ఆ తెలివైన కాకులు నిజంగానే ఈ ప పంచంలోనే ఉంటే.. ఇదేం పిచ్చిప్రశ్న.. తెలివైన కాకులు ఎక్కడన్నా ఉంటాయా? అనే కదా మీ ప్రశ్న.. కానీ నిజంగానే అటువంటి తెలివైన కాకుల్ని కనుగొన్నారు పరిశోధకులు. వివరాల్లోకి వెళితే..
దక్షిణ పసిఫిక్ సముద్రంలోని న్యూ కాలెడోనియా ద్వీపంలో నివసించే కాకుల్లో అద్భుతమైన తెలివితేటలు ఉన్నట్లు ఇటీవల పరిశోధకులు గుర్తించారు. ఎందుకంటే ఆ కాకులు ఆహార అనే్వషణకు గాలాలను వాటికవే తయారుచేసుకుంటున్నాయి. చెట్ల దుంగలకు రంధ్రాలను చేసి వాటి లోపల ఉండే పురుగులను బయటకు రప్పించడానికి గాలాలను ఉపయోగిస్తాయి. ఈ గాలాల ఆకర్షణకు గురైన పురుగులు బయటకు రాగానే కాకులు ఆ పురుగుల్ని తినేస్తాయి. అడవిలో వేల రకాల చెట్లు ఉన్నా తెలివైన కాకులు మాత్రం తమ వేట కోసం ఎప్పుడూ ఒకే రకమైన చెట్లనే ఎంపిక చేసుకుంటాయి. వీటన్నింటినీ గమనించిన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆ కాకుల మేథస్సును మరింత లోతుగా పరీక్షించేందుకు ఓ ప్రత్యేకమైన వెండింగ్ మెషీన్‌ను తయారుచేశారు. దీనిలోపల చిన్న చిన్న మాంసం ముక్కలు ఉంచారు. ఈ మెషీన్‌లో ఓ కాగితం ముక్క వేస్తే ఓ మాంసం ముక్క బయటకు వస్తుంది. దీని పనితీరును గమనించిన కాకులు ఈ మెషీన్‌ను చాలా తెలివిగా ఉపయోగించేస్తున్నాయి. వీటిని కాస్త తికమక పెట్టేందుకు పరిశోధకులు నిర్ణీత సైజు కాగితం ముక్కలను వెండింగ్ మెషీన్‌లో వేస్తేనే మాంసం ముక్కలు బయటకు వచ్చేలా మెషీన్‌లో మార్పులు చేశారు. ఈ పరిశోధనలో భాగంగా వారు ఎనిమిది కాకుల కోసం వేరు వేరు వెండింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు. ఒక్కోదాంట్లో ఒక్కో పరిమాణం కలిగిన కాగితం ముక్కలు పట్టేలా మెషీన్స్‌ని రూపొందించారు. అయినా సరే.. ఈ కాకులు ఆ మెషీన్స్‌కి తగ్గట్టుగానే కాగితాన్ని చించడం నేర్చుకున్నాయి. పక్కన ఓ పెద్ద పేపర్ షీట్‌ను ఉంచినా సరే.. ఆ కాకులు పెద్ద షీట్‌ను ఆ మెషీన్‌కు అవసరమైన పరిమాణంలోనే ముక్కలుగా చించి వాటిని మెషీన్‌లో వేసి మాంసం ముక్కలు తీసుకోవడం కాకులు నేర్చుకున్నాయి. మెషీన్‌లో ఎంత సైజు పేపర్ ముక్క పడుతుందో కూడా ఈ కాకులు తెలుసుకున్నాయి. ముందుగా డబ్బాలా ఉండే ఆ మెషీన్‌లో మాంసం ముక్కలు ఉన్నాయని, అందులో ఏదైనా వస్తువువేస్తే ఆ ముక్కలు బయటకు వస్తాయని ఆ కాకులకు తెలిసేట్లుగా, వాటి ముందు బాక్సుపై చిన్న చిన్న గులకరాళ్లను, పేపర్ ముక్కలను పెట్టారు. కాకులు వచ్చి ముక్కుతో పొడిచినప్పుడు అవి బాక్సులో పడ్డాయి. అప్పుడు వాటిలోంచి మాంసం ముక్కలు బయటకు వచ్చాయి. దాంతో కాగితం ముక్కలను, రాళ్లను లోపలికి పడేస్తే మాంసం ముక్కలు బయటకు వస్తాయని అవి గ్రహించాయని కేంబ్రిడ్జ్ పరిశోధకులైన డాక్టర్ సారా జెల్బర్ట్ వివరించారు. ఈ కాకుల తెలివితేటలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఏది ఏమైనా ఈ కాకుల తెలివితేటలు సూపర్ కదూ..! *