S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వంత వైద్యం మంచిదేనా?

ఈమధ్య మనుషులలో ఆరోగ్యం గురించి చాలా చైతన్యం వచ్చింది. ఇది మంచి పరిణామమే గానీ దానివల్ల కొన్నిచోట్ల నష్టాలు కూడా వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనలు, రకరకాలు టీవీ, వార్తాపత్రికలు, రేడియోల ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అవి చూసి ప్రజలు స్వంతంగా పరీక్షలు చేయించుకోవడం, తమకి తెలిసిన లేక దగ్గరగా వున్న మందుల షాప్‌కి వెళ్లి అందులోనివారికి తన బాధ చెప్పిగాని, తనకు తోచిన మందులుగాని కొని వాడడం జరుగుతోంది. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే చాలాసార్లు షాపులలోని వారికి మెడికల్ పరిజ్ఞానం గాని, మందుల యొక్క దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్)గాని తెలియవు. కొన్ని మందులు గర్భిణీలకు, పాలు తాగించే బాలింతలకు ఇవ్వకూడనివి ఉంటాయి. తర్వాత లేత నెలల గర్భిణీలకు కొన్ని మామూలు మందులు కూడా విషంగాను, కడుపులోని శిశువుకు ప్రమాదకరంగాను వుంటాయి. ఈ విషయం గుర్తుంచుకోవడం అందరికీ మంచిది. డాక్టర్ని సంప్రదించే ఓపిక, ఆర్థిక బలం లేకపోవచ్చు. అటువంటి వారు దగ్గరలోని గవర్నమెంటు క్లినిక్ లేక ఆసుపత్రికి వెళ్లి ఉచిత వైద్య సలహా, చికిత్స పొందవచ్చు.
అలాగే తమకి గుర్తింపు అవగాహనలేని వ్యాధులు సోకవచ్చు. ఒక్కోసారి డాక్టర్లకే అంతుపట్టని వ్యాధులు సోకవచ్చు. అటువంటప్పుడు ఆలస్యం చేయకుండా వారు నిర్ణయించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
ఇదేకాక చాలామంది గూగుల్ ద్వారా తమ వైద్యం తామే చేసుకోగలమనుకుంటారు. మరికొంతమంది వారంత వారే సరదాగా ఎక్స్‌రేలు సిటి స్కాన్లు, చిన్న తలనొప్పికో లేక కడుపునొప్పికో వారే వెళ్లి చేయించుకుంటారు. సెల్ఫ్ అని రాయించుకుని స్కాన్‌లు చేయించుకోవడం పరిపాటి. వారంతవారు రక్తపరీక్ష, ఉమ్మి పరీక్ష లేక మూత్రం పరీక్ష లేక ఇంద్రియం పరీక్ష చేయించుకుంటే ఏమీ హాని జరుగదు. కాని వాటిని పరీక్షించడానికి వైద్య సలహా ఎలాగూ కావాలి కదా?
ఒక ముఖ్యమైన సలహా వైద్యులందరి తరఫున చెప్పాలి. ఒక సిటి స్కాన్ ఒక వంద ఎక్స్‌రేలతో సమానమైన రేడియేషన్‌ని శరీరానికి గురిచేస్తుంది. రేడిషనువల్ల వచ్చే చెడు ఫలితాలు చాలా వుంటాయి. అందులో ముఖ్యం ఏ అవయవానికైనా కాన్సరు రావచ్చు. కనుక వైద్య సలహా లేకుండా వాడవద్దు, ముఖ్యంగా గర్భిణీ స్ర్తిలు.
తర్వాత జ్వరాలకి మూత్ర వ్యాధులకి తమకి తెలుసనుకున్నవీ ఎవరో వాడినవి మందులు మొదలుపెట్టి రెండు మూడు రోజుల తర్వాత తగ్గిపోయిందని పూర్తి కోర్సు వాడకుండా వదిలేస్తారు. దానితో ఆ సంబంధిత సూక్ష్మక్రిములు సగం తగ్గి దెబ్బతిన్న పులిలాగా ఇంకా మొండిగా విజృంభించి మందులకు తగ్గకుండా మనల్ని బాధించవచ్చు. ఈ విషయాలన్నీ జ్ఞాపకం పెట్టుకుని ప్రవర్తిస్తే ఎవరికీ హాని జరుగదు.

డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో