S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పరిమళం

పరిమళం
సువాసన.
ఇవి ఇష్టంలేని వ్యక్తులు ఎవరూ ఉండరు. కొంతమందికి కొన్ని సువాసనలు ఇష్టం ఉంటాయి. మరి కొంతమందికి అవి ఇష్టం ఉండకపోవచ్చు.
వాన చినుకులు నేల మీద పడినప్పుడు వచ్చే పరిమళాన్ని కొంతమంది బాగా ఇష్టపడతారు.
మల్లెపూల వాసన కొంతమందికి ఇష్టం.
గులాబీ పూల వాసన మరి కొంతమందికి ఇష్టం.
అత్తరు-
స్ప్రేలు ఇట్లా ఎన్నో.
కొంతమందికి అత్తరు ఇష్టం ఉండదు.
మరి కొంతమంది స్ప్రేలు ఇష్టపడరు.
సహజసిద్ధంగా ఉండే పరిమళాలు ఇష్టంలేని వ్యక్తులు చాలా తక్కువమంది ఉంటారు.
పువ్వుల్లో ఉండే సువాసనని అవి దాచుకోవు. వెదజల్లుతాయి.
అది సహజసిద్ధం.
మనం కూడా అలాంటి సువాసనల్ని అలవర్చుకోవాలి. అవి వెదజల్లాలి.
ప్రేమ
జాలి
కరుణ
సేవ
సహాయం - లాంటివి కూడా పరిమళాలే.
వాటిని వెదజల్లే విధంగా మనం తయారుకావాలి.
మనం వున్న ప్రదేశం ఆకర్షణీయంగా పరిమళభరితంగా తయారుచేయాలి.