పజిల్- 687
Published Saturday, 18 August 2018
ఆధారాలు:
=======
అడ్డం
1.దేవతల ఆవు. కోరింది ఇచ్చేది (5)
4.పైట ఇలాగా వేసుకుంటారు (4)
6.బంధువు ఆయన ముందు ‘ఆరోగ్యానికి హానికరమైన’ తాగేది (2)
8.దప్పిక (3)
9.శిలాదుర్గము (4)
11.కూతురు (2)
12.బురద (3)
14.అట్నించి కొంచెము (3)
17.్భయము (2)
18.నాలుకతో కూడిన ‘అసంతృప్తి ప్రదర్శన’ (4)
20.స్వర్గము (3)
21.గర్వము లేనివాడు (3)
23.క్రికెట్ ఆటలో గెలుపోటములు నిర్ణయించేది (4)
24.దేవతల చెట్టు. కోరింది ఇచ్చేది (5)
నిలువు:
=====
2.‘వసుమతి’లో కొంతా; మదనుడి’లో కొంతా కలిసిన స్ర్తి (4)
3.పొగడుట (4)
4.రంగు (2)
5.సమాచారం అందజేసేవాడు.
ఇతనిలో శివుడున్నాడు (5)
7.వాన (3)
9.దొరతనము (3)
10.పికము (3)
12.అవసరం (3)
13.కల్లోలమైన ‘మనసు’ (3)
15.అనంతపురం జిల్లాలో వజ్రాలు దొరుకుతాయనే ప్రతీతి గల ఊరు (5)
16.్భరతంలో ఓ ముఖ్య పాత్ర (3)
18.‘కర్వినిల్ప’ సరిజేస్తే ఈ సమాధి కనిపిస్తుంది (4)
19.బహుసంఖ్యాకము. నూట పాతికవేలు (4)
22.సింహాలకి ఇది ఉంటుంది. సింహాలు వీటిలో వుంటాయి (2)