S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బతకడం

ఈ ప్రపంచంలో ఒకటి మాత్రం సత్యం.
ఎవరు ఎంతకాలం బతుకుతారో తెలియదు కానీ, ఎన్నడో ఒకరోజు చనిపోతారన్నది పరమ సత్యం.
కృష్ణుడు గీతలో చెప్పిన విషయం ఇదే. పుట్టినవాడు గతించక తప్పదు.
మరణం గురించి మాట్లాడటం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ అది వాస్తవం.
ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. కానీ, చనిపోతామని అందరికీ తెలుసు. అది ఎప్పుడైనా కావొచ్చు. ఈ రోజే కావొచ్చు. రేపు కావొచ్చు. ఇంకా యాభై సంవత్సరాల తరువాత కావొచ్చు. ఈ విషయం తెలిసిన మనిషి బతకడానికి ప్రయత్నం చేయడు. అదే పెద్ద విషాదం.
జీవించడాన్ని ఓ పరాక్రమంగా అనుకొని జీవించవచ్చు. కానీ చాలామంది అలా చేయరు.
మనం ఈ ప్రపంచంలోకి రావడానికి ఓ ఉద్దేశం ఉంది. ఈ ప్రపంచాన్ని ఇంకా కొంచెం మంచిగా తీర్చిదిద్దడమే మనం చేయాల్సింది. ఆ విధంగా చేయడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు?
మనకున్న శక్తి సామర్థ్యాలని సంపూర్ణంగా వినియోగించి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయవచ్చు. కానీ చాలామంది బద్దకంగా ఉంటారు. పదవీ విరమణ తరువాత పనిలేదని అనుకుంటారు. కొంత వయసు మీద పడగా ఇంకా ఏమీ చేయకూడదని అనుకుంటారు. ఇది ఎంతవరకు సమంజసం..?
ఎన్నో సమస్యలు వున్నాయి. అందరికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఎంతమంది చేస్తున్నారు?
ప్రేమని, కరుణని పంచవచ్చు. కానీ ఎంతమంది..?
ఏదో ఒకరోజు చనిపోవడం ఖాయం.
అది మన చేతిలో లేదు.
కానీ
చనిపోయేదాకా బతకడం మన చేతిలోనే ఉంది.

- జింబో 94404 83001