S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మూగప్రాణుల స్నేహితుడు

ఆ ఇంట్లో కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులే కాదు.. పులి, హైనా, ఎలుగుబంటి, హైనా, పాములు.. వంటి క్రూర జంతువులు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆ ఇంట్లో పెంపుడు జంతువులే.. ఇవి ఆ ఇంట్లోని మనుషులకు ఎటువంటి హాని చేయకుండా ఎంతో విశ్వాసంగా, ప్రేమగా మెలుగుతాయి. పెంపుడు జంతువుల్లా ఇంట్లో వారితో ఆడుకుంటాయి. పిల్లలకు ఎటువంటి హాని చేయకుండా వారిని ముద్దు చేస్తాయి. అదే ‘యానిమల్ ఆర్క్’. మహారాష్టల్రోని మారుమూల ఆదివాసీ గ్రామంలోని ఓ ప్రైవేటు జంతు సంరక్షణ కేంద్రం అది.
ఆదివాసీల సంక్షేమం కోసం గడ్చిరోలి జిల్లాలోని మారుమూల హేమల్కాస గ్రామంలో నలభై నాలుగేళ్ల క్రితం డాక్టర్ ప్రకాశ్ ఆమ్టే తన సన్నిహితులతో కలిసి సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన ప్రఖ్యాత సమాజ సేవకుడు బాబా ఆమ్టే కుమారుడు. తండ్రి నుంచి వచ్చిన సేవా వారసత్వాన్ని ప్రకాశ్ కొనసాగిస్తున్నారు. అలాగని ఆ తండ్రి కుమారుడు అని చెప్పుకోకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశ్ ఆమ్టే. అతనో డాక్టర్. తన వైద్య పరిజ్ఞానాన్ని నగరాలకు పరిమితం చేయకుండా ఆదివాసీలకు అందించాలని భావించారు. ఇందుకోసం గడ్చిరోలి ప్రాంతాన్ని కార్యక్షేత్రంగా మలచుకున్నారు. తాను ఎంచుకున్న రంగం లో, ఎంచుకున్న ప్రాంతం లో నిశ్శబ్దంగా పనిచేసుకుపోవడమే కాకుండా అక్కడి ఆదివాసీలకు, వణ్యప్రాణులకు ముఖ్యంగా క్రూర మృగాలకు సైతం దేవుడిగా మారారు.
కళ్లు తెరవకముందే తల్లికి దూరమైన కూనలను చేరదీసి సంరక్షించేందుకు 1973లో ఆయన యాభై ఎకరాల్లో ఒక కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఆయన అనేక రకాల వన్యప్రాణులకు ఆశ్రయం కల్పించడంతో 1991లో ప్రభుత్వం దానికి ‘జంతు రక్షణ కేంద్రం’గా గుర్తింపును ఇచ్చింది. ఈ సంరక్షణ కేంద్రంలో చిరుతలు, హైనాలు, జింకలు, బ్లూబుల్స్, ఎలుగుబంట్లు, మొసళ్లు, నక్కలు, ఉడుములు, పాములు, నెమళ్లు, గుడ్లగూబలు.. ఇలా దాదాపు వంద రకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. చిరుతలు, హైనాలు అంటే చాలామందికి భయం ఉంటుంది. కానీ ప్రకాశ్ ఆమ్టే మాత్రం వాటితో స్నేహం చేస్తూ సరదాగా ఆడుకుంటారు. రోజూ వాటి మధ్యే తిరుగుతూ, ఇతర పెంపుడు జంతువుల్లాగే వాటినీ పెంచుతున్నారు. నాలుగు దశాబ్దాలుగా వాటిని పెంచుతున్నా ఏనాడూ అవి అతనిపై దాడిచేయలేదు. ఆయన పైనే కాదు.. అక్కడున్న నిర్వాహకులపై కూడా ఆ క్రూర జంతువులు ఎప్పుడూ వాటి ప్రతాపాన్ని చూపలేదు. ఇతర పెంపుడు జంతువుల్లోలాగానే అవి ప్రేమగా అతని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. వన్యప్రాణుల సంరక్షణకు చేస్తున్న సేవకు గుర్తింపుగా ప్రకాశ్ ఆమ్టేను రామన్ మెగసెసె అవార్డు వరించింది. అయితే, కేంద్ర అటవీశాఖ ప్రవేశపెట్టిన నిబంధనలు ఈ ‘జూ’ నిర్వహణకు అడ్డంకిగా మారుతున్నాయి. కేంద్ర నిబంధనల ప్రకారం వన్యప్రాణులను తాకడం నిషిద్ధం. కానీ ప్రకాశ్ వాటిని చాలా ప్రేమగా, నిమురుతూ పెంచుతారు. ఇదే పెద్ద అడ్డంకి అంటారు ప్రభుత్వం వారు. కానీ ఆ మూగ(క్రూర)జీవులకు ఈ నిబంధనలేవీ తెలీదు కదా.. అందుకే అవి ఆనందంగా ప్రకాశంతో ఆడుకుంటాయి.