S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాఖీ పౌర్ణమి

హిందూ సంప్రదాయ పండుగల్లో బంధాలను, బంధుత్వాలను.. అన్నాచెల్లెళ్ల.. అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలను చాటిచెప్పే పండుగ రాఖీ పౌర్ణమి. అంతటి పవిత్రమైన, ప్రాధాన్యత కలిగిన రాఖీ పౌర్ణమిని ఏటా శ్రావణమాసంలో పౌర్ణమి రోజున జరుపుకోవడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు.. ఇలా చిన్నా పెద్ద అనే తారతమ్యం లేకుండా ఆప్యాయతలను పంచేది రాఖీ పండుగే.. అనుబంధం, ఆప్యాయతలకు మారుపేరుగా నిలిచి, బంధువుల మధ్య సత్సంబంధాలను మెరుగుపరుస్తుంది. సోదర సోదరీమణుల మధ్య రక్తసంబంధాన్ని కలకాలం నిలిపే పండుగే రక్షాబంధన్. ఈ పండుగ రోజున అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములను రాఖీలను కట్టి.. వారిపై తమకున్న ఆప్యాయతను చాటుతారు. రాఖీని కట్టుకున్న సోదరులు బహుమతులతో తమ ప్రేమను తెలుపుతారు.
రక్షాబంధన్ అనేది కేవలం అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు కట్టుకునేది కాదు. రక్షాబంధనం ద్వారా రక్ష కల్పించాలనే ప్రతిజ్ఞ ఆత్మీయులకు భరోసా కల్పించడమే అని ధర్మశాస్త్రం చెబుతోంది. రాజవంశాల నుంచే ఈ పండుగ ప్రారంభమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. రాజులు యుద్ధాలకు వెళ్లేముందు, ఏదైనా కార్యం తలపెట్టే ముందు రక్షను కట్టుకుని ఆ తర్వాత కార్యాలను మొదలుపెట్టి గెలుపొందేవారు. రాఖీపౌర్ణమి రోజు కట్టే రక్షలో అసామాన్యమైన విష్ణుశక్తి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ విశ్వాసం. అలా నేటి యుగంలో అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు రాఖీ కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ రాఖీలు ఒకదాన్ని మించి ఒకటి.. రకరకాల రంగుల్లో అందంగా మార్కెట్లో కొలువుతీరాయి. నేడు రక్షాబంధన్ సందర్భంగా వాటిలో కొన్ని మీ కోసం..