S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

స్వీయ నియంత్రణ అవసరం

(గత సంఛిక తరువాయ)
ఒకప్పుడు చేపల విషయంలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఒక చిన్న చేపలో చాలా తక్కువ మైక్రోగ్రాముల్లో డిడిటి ఉంటుందని, దాన్ని అంతకన్నా పెద్ద చేప మింగినప్పుడు, ఆ పెద్ద చేపలో అప్పటికే ఉన్న డిడిటికి ఈ చిన్న చేపలోని డిడిటి తోడౌతుందని, ఇలా చిన్న చేపని పెద్దచేప మింగుతూ పోయినప్పుడు, అనేక చేపలను మింగిన పెద్ద చేపలో పరిమితికి మించిన డిడిటి పేరుకుని ఉంటుందనీ శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. డిడిటి అనేది ‘్ఫడ్ చైన్’లో త్వరగా కలిసిపోయి తరతరాలకు వ్యాపిస్తుందంటున్నారు.
ఇది థైరాయిడ్ లాంటి గ్రంథుల మీద చెడు కలిగించడమే కాకుండా, కేన్సర్ లాంటి వ్యాధులకు కూడా కారణం అవుతుంది. డిడిటి లాంటి ఒక విష పదార్థాన్ని జనసామాన్యం వాడకానికి అందుబాటులోకి తెచ్చే ముందు ఇలాంటి దుష్ట ఫలితాల గురించి ఆలోచించక పోవటం, వెర్రిగా దానిని, ఇతర భయంకర విషాలను, ఆహార ద్రవ్యాల మీద చల్లటం.. ఇవన్నీ మనం తెలిసి చేస్తున్న తప్పులు. ఇది ఒక వ్యక్తిని నిలదీసే విషయం కాదు. సామూహిక తప్పు. సామూహికంగా అందరూ అందుకు బాధ్యులే!
దోమలను పోగొట్టడానికి మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా డిడిటి వాడకం విస్తృతంగా కొనసాగుతూనే ఉంది నేటికీ. మలేరియా నిర్మూలన కాలేదు. మానవ నిర్మూలన మాత్రం సాగుతోంది. తల్లి రక్తంలోంచి మావి పొరలను దాటుకుని ఉమ్మ నీటిలో తేలియాడే పాపాయిని కూడా ఈ డిడిటి చేరుతోందనే వార్త నిజంగా ఆందోళన దాయకమైనదే!
ఇంట్లో మనం వాడుకునే చాలా వస్తువుల్లో ఇలాంటి విషాలు ఉంటున్నాయి. టీవీల్లో ఊదరగొట్టే క్రిమిసంహారకాల ప్రకటనల్ని చూసి నల్ల రంగుదంటే నల్లది, ఎర్రరంగుదంటే ఎర్రది దోమల మందు, చీమల మందు, బొద్దింకల మందు, బల్లుల మందు, ఎలుకల మందు.. ఇలా క్రిమిసంహారకాలను యధేచ్ఛగా వాడేస్తున్నాం. ఎవరినో నిందించబోయే ముందు ఇంట్లో మనం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవటం కూడా అవసరం. పూర్వం అంట్లు తోమటానికి కొబ్బరిపీచు, కచ్చికపొడి (బూడిద) వాడేవాళ్లు. ఇప్పుడు చేతులు పొక్కిపోయే విష రసాయనాలను వాడుతున్నాం. అంట్ల పళ్లెం మీద జిడ్డు పోగొట్టే ఒక విష రసాయనం ఆ జిడ్డుని పోగొట్టి దాని స్థానే అది అంటుకుని కూర్చుంటుంది. ఆహార పదార్థంతో కలిసి అది కడుపులోకి చేరుతుంది. ఇలా ఒకటేమిటి.. నిరంతరం వంటింటి విషాలతో సహజీవనం చేస్తున్నాం మనం.
20వ శతాబ్దంలో పంటచేల మీద వానలా కురిసిన డిడిటి దుష్పలితాలను 21వ శతాబ్దపు పసిపిల్లలు అనుభవిస్తున్నారని డా.అలన్ ఎన్ బ్రౌన్ అనే శాస్తవ్రేత్త వ్యాఖ్యానించాడు. రేపటి తరానికి హాని చేయని రీతిలో విష పదార్థాల వాడకాన్ని స్వీయ నియంత్రణ ద్వారా అదుపు చేసుకోవటం అవసరం.
దీనికి విరుగుళ్లు, ప్రత్యామ్నాయాలు ఏవీ ఈ పరిశోధనలో సూచించక పోయినప్పటికీ, విషాలతో ఆడుకోవద్దని, పాములతో చెలగాటం అవుతుందని హెచ్చరించటం కూడా అవసరమే!
ఎలుకల నిర్మూలన కోసం, బొద్దింకలు దోమల నిర్మూలన కోసం ప్రకృతి సిద్ధమైన ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించండి గానీ, విష రసాయనాలను కొని ఇంట్లోకి తేకండి.

- డా. జి.వి.పూర్ణచందు సెల్ : 9440172642 purnachandgv@gmail.com