S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పోలవరం స్పిల్‌వే గ్యాలరీ ప్రారంభం

ఏలూరు, సెప్టెంబర్ 12: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అద్భుత ఘట్టానికి నాంది పడింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా భావించే స్పిల్‌వే గ్యాలరీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం ప్రారంభించి, నడకకు శ్రీకారం చుట్టారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన సాగాలంటూ నిర్వహిస్తున్న యాగంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నుంచి స్పిల్‌వే ప్రాంతం చేరుకుని స్పిల్‌వే గ్యాలరీని ప్రారంభించారు. పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ స్పిల్‌వే గ్యాలరీ మొత్తం 1118 మీటర్లు కాగా 48గేట్ల దిగువ భాగంలో ఒకటి నుంచి 48వ బ్లాకు వరకు నిర్మాణం జరిగింది. ఈ మార్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనుమడు దేవాన్ష్‌తో కలిసి నడిచారు. శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, రాష్ట్ర శాసనమండలి స్పీకర్ ఫరూక్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గ్యాలరీవాక్‌లో పాల్గొన్నారు. చంద్రబాబు కుటుంబసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు గ్యాలరీవాక్ కొంతదూరమే నిర్వహించగా చంద్రబాబు మాత్రం దాదాపు గంట సమయంలో మొత్తం గ్యాలరీని దాటేశారు. అనంతరం ఆయన సభలో పాల్గొని ప్రసంగించారు. దేవాన్ష్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని చూపిస్తూ కొద్దిసేపు ముచ్చట తీర్చుకున్నారు. అనంతరం జరిగిన సభలో కూడా దేవాన్ష్ తన నానమ్మ భువనేశ్వరి ఒడిలో కూర్చొని మంత్రులు, ఇతరుల ప్రసంగాలను ఆలకించాడు. ఈసమయంలోనే ముఖ్యమంత్రి వద్దకు వచ్చి కొద్దిసేపు ఆయనతో కలిసి ముచ్చట్లాడాడు వాస్తవానికి ప్రాజెక్టు ప్రాంతాల్లో గ్యాలరీ వాక్ నిర్వహించటం గతం నుంచి ఆనవాయితీగా సాగుతూ వస్తోంది. అయితే ఏ ప్రాజెక్టులోనైనా గ్యాలరీ నిర్మాణం వరకు వస్తే ఆ ప్రాజెక్టు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రాజెక్టుల్లో ఉన్న ప్రధాన నిర్మాణాలను కవర్ చేస్తూ ఈ గ్యాలరీ నిర్మాణం సాగుతుంది. రానున్న రోజుల్లో ప్రాజెక్టు ఆకృతుల్లో ఎక్కడైనా లోటుపాట్లు తలెత్తినా గ్యాలరీ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకుని మరమ్మతులు నిర్వహించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వరదలు వచ్చినా, లేదా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రాజెక్టు భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఈ గ్యాలరీ నిర్మాణం ఎంతో ఉపకరిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో నాగార్జునసాగర్ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయాంలో ఆ ప్రాజెక్టుకు గ్యాలరీ నిర్మించారు. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఇందిర స్వయంగా గ్యాలరీ వాక్ నిర్వహించి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా పరిశీలించారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక నిర్మాణాలు తుదిదశకు చేరుకున్న దశలో స్పిల్‌వే గ్యాలరీని నిర్మించి, పోలవరం ప్రాజెక్టు పురోగతిని ప్రపంచానికి తెలియచెప్పినట్లు అయింది. అంతేకాకుండా సభలోను, అంతకుముందు కూడా పలువురు నాయకులు గ్యాలరీ వాక్‌పై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. స్వయంగా రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఏదైనా భారీ ప్రాజెక్టు నిర్మించాలంటే ఇంతకాలం నాలుగు తరాలు పట్టేదని, ఒకతరంలో ఆలోచన చేస్తే, మరొకతరంలో నిర్మాణానికి శ్రీకారం చుట్టేవారని, ఆ తర్వాత తరంలో దాన్ని ముందుకు తీసుకువెళ్లటం, చివరకు నాల్గవ తరం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగేదని, అలాకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రి, పగలు కష్టపడి పోలవరం పనులకు శ్రీకారం చుట్టి ఆయనే గ్యాలరీ వాక్ నిర్వహించటం రికార్డుగానే చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు. పలువురు నాయకులు ప్రస్తావించారు. అంతేకాకుండా 68 ఏళ్ల వయస్సులో దాదాపు కిలోమీటరు పొడవు ఉన్న స్పిల్‌వే గ్యాలరీని వేగంగా అడుగులు వేసుకుంటూ ప్రాజెక్టు మొత్తాన్ని పర్యవేక్షిస్తూ ముందుకు నడిచారు. విశేషం. చివరకు ఆయనతోపాటు నడవలేక కొంతమంది మధ్యలోనే ఆయనను కొద్దిసేపు నిలిపివేయటం గమనార్హం. ఇదిఇలాఉండగా అతికీలకమైన స్పిల్‌వే గ్యాలరీ వద్ద, గ్యాలరీ లోపల ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు ఫోటోలు దిగడానికి పోటీపడటం కూడా విశేషంగానే చెప్పుకోవాలి.

చిత్రాలు.. స్పిల్‌వే గ్యాలరీ పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
*యాగంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కుటుంబ సభ్యులు