S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వెంకన్న సన్నిధిలో వింతైన అద్భుతాలు

ఏడుకొండలుగా ప్రసిద్ధిగాంచిన శేషాచల శిఖరాలలో వెలసి ఉన్న శ్రీవారి ఆలయంలో ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క ప్రదేశం ఒక దివ్యమైన ఘట్టమే! ప్రతిదానికీ ఏదో ఒక విశిష్టతే!

విరజానది
సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్నబావిని విరజానది అని విరజాతీర్థం అని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠంలోని దేవనదియైన విరజానది శ్రీ స్వామివారి పాదాల కింద నుంచి ప్రవహిస్తున్నదన్నది ఆర్యోక్తి. ఆ నదిలోని కొంత భాగమే ఈ పవిత్రబావి. ఈ విరజానది తీర్థానికి చుట్టూ బావి మాదిరిగా చతురస్రాకారంగా పొడవైన చెక్కడపు రాళ్లతో నిర్మించారు. నాలుగువైపుల నేలమట్టానికి సమంగా నెలకొల్పబడిన ఈ రాళ్లకు లోపలి అంచుల్లో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. తూర్పుశిలమీద వానరుల మధ్య రామలక్ష్మణులు, పడమటిదిక్కు శిలమీద సీతారామలక్ష్మణులు, హనుమంత సుగ్రీవులు, దక్షిణంవైపు రాతిమీద కాళీయ మర్థనం చేస్తున్న కృష్ణుడ్ని శరణు వేడుతున్న నాగకన్యలు, ఉత్తరంవైపున ఏనుగును ఆజ్ఞాటపిస్తున్న వేంకటేశ్వరుడు, ప్రక్కన గరుడుడు, ఆ ప్రక్కన గరుడవాహనుడైన వేంకటేశ్వరుడు ఈ సుందర శిల్పాలు చెక్కబడ్డాయి. ఈ విరజా (నది) బావి శిలలపై లోపలి అంచులమీద ఇలాంటి బొమ్మలు ఉన్నందువల్లే తిరుమల స్థానికులు దీనిని ‘బొమ్మలబావి’ అని కూడా అంటారు.

*

-రామాపురం రాజేంద్ర ఫొటోలు: తలారి రెడ్డెప్ప