S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గుంతలెవరు పూడుస్తారు?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దేశంలో రహదారుల నిర్వహణపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017 సంవత్సరంలో రోడ్డు ప్రమాదాల్లో 3,597 మంది మృతి చెందడంపై కోర్టు స్పందించింది. మరణాలన్నీ అస్తవ్యస్త రోడ్లు, గోతుల మూలంగానే జరిగాయని తెలుసుకున్న సుప్రీం కోర్టు ‘ఇది అత్యంత దురదృష్టకరం’ అని వ్యాఖ్యానించింది. ఒక్క ఏడాదిలోనే ఇంత మంది చనిపోవడం బాధకరమని బెంచ్ పేర్కొంది. న్యాయమూర్తులు మదన్ బీ లోకూర్, దీపక్ గుప్తాతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ (ఎంఓఆర్‌టీహెచ్) నివేదికను పరిశీలించింది. ఈ గణాంకాలతో రాష్ట్ర ప్రభుత్వాలు విభేదించడం, పొంతనలేని సాకులు చూపడంపై బెంచ్ ఆశ్చర్యం ప్రకటించింది. ‘ఎంఓఆర్‌టీహెచ్ గణాంకాలతో మీరు విభేదించవల్సి రావడం కోర్టును ఆశ్చర్యానికి గురిచేసింది’అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల తీరు దురదృష్టకరం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారుల నిర్వణ లోపం వల్లే వందలాది మంది చనిపోవడం, గాయపడడం జరుగుతోందని, దేశంలో ఈ పరిస్థితులు భయపెడుతున్నాయని గతంలోనే సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. గోతుల మయమైన రోడ్ల వల్ల ఎక్కడ ఎంత మంది చనిపోయిందీ కేంద్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకుంది. ఒక్క 2017లోనే 3,597 ప్రమాదాలు జరిగాయని తెలుసుకున్న బెంచ్ తీవ్ర వ్యాఖ్యలే చేసింది. ఆ సంవత్సరంలో తీవ్రవాద ఘటనల్లోనూ అంత మంది ప్రాణాలు కోల్పోలేదని, ఇవి అంతకన్నా భయానకమైన మరణాలని న్యాయమూర్తులు అన్నారు. రహదారుల నిర్వహణకు నిధుల లేమిని సాకుగా చూపుతున్న రాష్ట్రాలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రహదారుల భద్రతపై సుప్రీం కోర్టు ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి కేఎస్ రాధాకృష్ణన్ అధ్యక్షతన గల కమిటీ ఇటీవల సమావేశమైంది. సమావేశానికి హాజరైన పలు రాష్ట్రాలు కేంద్ర నుంచి తమకు సరిపడా నిధులు రావడంలేదని తెలిపాయి. దీనిపై బెంచ్ మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోడ్లు నిర్మించి వాటిని నిర్వహణకను గాలికొదిలేస్తారా?అని ప్రశ్నించింది. ‘రోడ్ల నిర్వహణ మా బాధ్యత కాదని ఎలా తప్పించుకుంటారు?. రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి గానీ, నిర్వహణకు మీ వద్ద డబ్బులు లేవా?’అని బెంచ్ రాష్ట్రాలను నిలదీసింది. ‘రహదారులపై గుంతలు మీరు పూడుస్తారా? ప్రజలు పూడ్చుకోవాలా?’అని కోర్టు తీవ్రంగా మందలించింది. రహదారుల భద్రతకు సంబంధించి తాము ఏర్పాటు చేసిన కమిటీ చక్కగా పనిచేస్తోందని, ఎటొచ్చీ రాష్ట్ర ప్రభుత్వాలే నిర్లక్ష్యంగా ఉంటున్నాయని జస్టిస్ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తా అన్నారు. కాగా కోర్టు మధ్యవర్తిగా నియమితులైన న్యాయవాది గౌరవ్ అగర్వాల్ మాట్లాడుతూ ప్రధానమైన సమస్యలపై అధికారులు దృష్టి సారించడం లేదని కోర్టుకు తెలిపారు. గుంతలు పూడ్చివేతకు సంబంధించి ఓ స్పష్టమైన విధానం సమావేశంలో చర్చకు రాలేదని ఆయన అన్నారు. గతంలో ఇవే మరణాలపై విచారించిన సుప్రీం కోర్టు రహదారులు అస్తవ్యస్తం, గుంతల వల్లే సంభవిస్తున్నాయని పేర్కొంది. వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో రోడ్లన్నీ గుంతల మయమని, ఏకంగా 4000 గుంతలు ఉన్నట్టు కోర్టు దృష్టికి వచ్చింది. ‘ప్రజలు గుంతల వల్ల చనిపోతుంటే.. అధికారుల మాత్రం రోడ్లపై గుంతల లెక్కపెడుతున్నారు’అని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.