S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నాగలాపురానికి చేరిన శ్రీవారి గొడుగులు

నాగలాపురం, సెప్టెంబర్ 15: తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నై తిరునిండ్రవూరుకు చెందిన శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు 14వ సంవత్సరాన్ని పురస్కరించుకొని పాదయాత్ర ద్వారా గరుడసేవ రోజు శ్రీవారికి గొడుగులు సమర్పించి వెళుతుంటారు. ఈ సందర్భంగా శనివారం నాగలాపురం మండలకేంద్రానికి శ్రీవారి గొడుగులు శనివారం నాగలాపురానికి చేరుకోవడంతో స్థానిక ప్రజలు, భక్తులు శ్రీవారి గొడుగులకు స్వాగతం పలికి శ్రీమద్ రామానుజ కైంకర్య ట్రస్టు సభ్యులైన కోదండరామర్, గీతాంజలి సంపత్‌లకు ఘనంగా శాలువ, పూలమాలతో సన్మానించి శ్రీవారి గొడుగులకు స్వాగతం పలికారు. అనంతరం పిచ్చాటూరు మండలం గోవర్థన గిరిలో ఉన్న శ్రీ వెంకయ్య స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలకు వారు గొడుగులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాగలాపురం స్థానికులు సంపత్ మొదలి, గోవిందరెడ్డి, డాక్టర్ దామోదరం పాల్గొన్నారు.

డిసెంబర్ రూ.300 దర్శనం టికెట్లు విడుదల
తిరుపతి, సెప్టెంబర్ 15: భక్తుల సౌకర్యార్థం రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు డిసెంబర్ నెల కోటాను ఈనెల 11న టీటీడీ విడుదల చేసింది. ఐటీ అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లు, పోస్ట్ఫాసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్ చేసుకోవచ్చు. భక్తులు ఈవిషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ శనివారం ఒకప్రకటనలో కోరింది.

ఆకట్టుకున్న కొండవీటి జ్యోతిర్మయి గాత్రం
తిరుపతి, సెప్టెంబర్ 15: తిరుమలలోని శ్రీవారి ఆలయం వద్ద సహస్రదీపాలంకరణ సేవ మండపంలో శనివారం సాయంత్రం శ్రీ స్వామివారికి నిర్వహించిన ఊంజలసేవ సందర్భంగా ప్రముఖ సంగీత కళాకారణి కొండవీటి జ్యోతిర్మయి గాత్రం అందరిని ఆకట్టుకుంది. ఊంజల్ సేవలో వేదపండితుల చతుర్వేద పారాయణం అనంతరం జ్యోతిర్మయి అన్నమయ్య సంకీర్తలను రసరమ్యంగా ఆలపించారు. ఇందులో ‘ గోవింద గోవిందయని కొలువరే... చల్లరే హరిపై జాజర జాజ... అలరచంచలమైన ఆత్మలందుడనీ అలవాటు జేసేనీ ఉయ్యాలా’’ తదితర సంకీర్తనలు ఆలపించారు.

విద్యాపీఠంలో పట్ట్భారామశాస్ర్తీ వ్యాఖ్యానమాల ప్రారంభం
తిరుపతి, సెప్టెంబర్ 15: రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠంలో మహామహోపాధ్యాలయ పట్ట్భారామశాస్ర్తీ వ్యాఖ్యానమాల ఉపన్యాసాల పరంపర వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వీసీ ఆచార్య మురళీధర శర్మ, విద్వాన్ జనార్ధన్ హెగ్డే, నాగపూర్‌లోని కవిలకుగురు కాళిదాస సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ శ్రీనివాస వరఖేడి, వ్యాఖ్యానలమాల కో ఆర్డినేటర్ ఆచార్య సంపత్ కుమార్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.