S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేటి పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే రైతాంగానికి శ్రీరామరక్ష

చిన్నగొట్టిగల్లు, సెప్టెంబర్ 15: రైతులు సంపూర్ణ ప్రకృతి వ్యవసాయం చేసేందుకు సన్నద్దం కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, కో ఆపరేటివ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ తెలిపారు. శనివారం ఉదయం మదనపల్లి డివిజన్ చిన్నగొట్టిగల్లు, పీలేరు, కె వి పల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి కరవుకారణంగా దెబ్బతిన్న వేరుశనగ పంటను పరివీలించారు. ఈ పర్యటనలో తొలుత చిన్నగొట్టిగల్లు మండలం రాజువారిపల్లి గ్రామంలో మహిళా రైతు యశోదమ్మ రెండు ఎకరాల్లో వేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా నెరబైలు చెందిన విజయరామిరెడ్డి మాట్లాడుతూ వర్షాధార పంటలపై ఈ ప్రాంత రైతులు ఆధారపడి జీవిస్తున్నారని, ప్రభుత్వం సబ్సిడీతో ఇచ్చే విత్తనాల్లో 70శాతం నాణ్యత కలదని, మిగిలిన 30శాతం నాణ్యత లేకపోవడం జరుగుతున్నదని,ఈ ప్రాంతంలో పందులు వలన పంట నష్టం ఎక్కువగా జరుగుతున్నదని, పంటలు కాపాడుకోవడానికి లేజర్ ఫినిషింగ్‌కి ప్రభుత్వం సబ్సిడీతో రుణం మంజూరు చేయాలని కోరారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయాలని తద్వారా రైతులకు కూలీల భారం తగ్గుతుందని పలువురు రైతులు తెలిపారు. ఇన్‌పుట్ సబ్సిడీని రాయలసీమ ప్రాంతంలో ఉన్న రైతులకు పెంచాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల ఇబ్బందులను తొలగించాలని సమష్టిగా రైతులందరూ ప్రధాన కార్యదర్శిని విన్నవించుకున్నారు. రైతుల సమస్యలపై పత్యేక ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తోందన్నారు. నరేగాను రైతులకు అనుసంధానం చేసే విషయమై భారతప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరిగిందన్నారు. అందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి సభ్యులుగా ఉన్నారని, ఉపాధి కూలీలకు ప్రస్తుతం కల్పిస్తున్న పనిదినాలను పెంచి అదనంగా 50రోజులు జోడించి వ్యవసాయ రంగానికి అనుసంధానం చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారన్నారు. నేటి పరిస్థితుల్లో రైతుల సమస్యలకు ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం చూపుతుందని, దీనిని ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో శాస్ర్తియం నిరూపించామని తెలిపారు. అనంతపురంలో మే నెలలో వేసిన విత్తనాలు ఎటువంటి వర్షపాతం లేకపోయినా గాలిలోని తేమ, భూగర్భంలో ఉన్న తేమ ఆధారంతో విత్తనాలు మొలకెత్తాయన్నారు. రానున్న రోజుల్లో పూర్తిగా వర్షాలు తగ్గే పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయమే పరిష్కారం చూపుతుందన్నారు. ఈ దిశగా రైతులు కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఐదు వరుసల పద్ధతిలో నవధాన్యాల పంట సాగు వలన సంవత్సరం పొడవునా రైతులకు ఆదాయం ఉంటుందన్నారు. కొత్త ఆలోచనలతో కొత్త ప్రయోగాలతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి రైతాంగం సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి నేటి పరిస్థితులను అనుగుణంగా వ్యవసాయం వైపు మరల్చేందుకు అవసరమైన శిక్షణ కూడా ప్రభుత్వం అందజేస్తామన్నారు. 2024నాటికి రాష్టవ్య్రాప్తంగా 60వేల హెక్టార్లలో 60లక్షల మంది రైతాంగాన్ని ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చిత్తూరు జిల్లాలో 66మండలాల్లో 63మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారని, రాయలసీమ జిల్లాలోని రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రైతాంగం విన్నపం మేరకు ఇన్‌పుట్ సబ్సిడీని ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాల్లో పెంచే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయనుందన్నారు. కేంద్రాల ద్వారా రైతు ఆధార్ నెంబర్, సెల్ నెంబర్ చెబితే ఆ రైతుకు సంబంధించిన సమాచారం, వారి భూముల వివరాలు, వారు ఏ పంట వేస్తే అనుకూలమో అందుకు సంబంధించిన ఎరువులు, విత్తనాలు సమగ్ర సమాచారాన్ని రైతులు తెలుసుకోవచ్చునన్నారు. దేశ వ్యాప్తంగా రైతులు ఇతర రాష్ట్రాల్లో సేవలందిస్తున్నప్పటికీ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగతించి సమాచారాన్ని కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతాంగానికి అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ కేంద్రాల ద్వారా పంటల దిగుబడి తరువాత ధరల పరిస్థితి ఏ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయని ఇలా పూర్తి సమాచారాన్ని తెలుకోవచ్చునని తెలిపారు. జిల్లాలోని అన్ని కరువు మండలాల్లో ఉలవలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. మహిళా రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బాగంగా బోరాన్, ఉలవలు, ప్రధాన కార్యదర్శి చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ విజయ్‌కుమార్, ఇతర వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పాల్గొన్నారు.