S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గణపతి బొప్ప మోరియా... నిమజ్జనానికి తరలిన గణపయ్యలు

తిరుపతి, సెప్టెంబర్ 15: వినాయక నిమజ్జనం సందర్భంగా శనివారం తిరుపతి నగరం వినాయక నామ స్మరణలతో, పాటలతో మారుమ్రోగింది. నగరంలో దాదాపు 750కిపైగా వినాయక మండపాలు వెలిశాయి. మూడో రోజున నగరంలో ఎక్కువ మంది వినాయక మండపాల నిర్వాహకులు తమ మూడు రోజులుగా కొలువుదీర్చి పూజించిన వినాయక విగ్రహాలను భారీ ఊరేగింపుల నడుమ నిమజ్జనానికి తరలించారు. ఈసందర్భంగా గణపతి బొప్పా మోరియా... జై జై గణేషా... అంటూ నినాదాలు చేస్తూ, నృత్యాలు చేస్తూ.. వాహనాల్లో వినాయక సాగర్‌కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా స్థానిక భవానీ నగర్‌లో శ్రీనాధ్ ఆధ్వర్యంలో భారీ వినాయ విగ్రహాన్ని కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రతి రోజుప్రత్యేక నైవేద్యాలు తయారు చేసి సమర్పిస్తున్నారు. అలాగే భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తున్నారు. కాగా స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. అలాగే స్థానిక సుందరయ్య నగర్‌లో వరసిద్ధి వినాయక సంఘం నిర్వాహకులు నరేంద్ర, జయన్న ఆధ్వర్యంలో భారీ ఎత్తున వినాయక చవితిని నిర్వహించి శనివారం నిమజ్జనం సందర్భంగా, మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలైన మహిళలకు చీరలు, పురుషులకు దుస్తులను అందించి అభినందించారు. కాగా సాయంత్రం 4గంటలకు స్థానిక యువతీ, యువకుల కేరింతల నడుమ వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు. అలాగే స్థానిక సరోజినీదేవి రోడ్డులో యంగ్ ఎలైట్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఆర్ ఆర్ శ్రీనివాస్, కార్యదర్శి టీవీ మనోహర్‌ల ఆధ్వర్యంలో వినాయక విగ్రహాని కొలువుదీరి ప్రత్యేక పూజలు చేశారు. శనివారం వినాయకుని నిమజ్జనం సందర్భంగా 1200 మందికి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత కాపు సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వూకావిజయ్‌కుమార్, శ్రీసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జీపీ కిరణ్‌కుమార్, ఎటీఎన్ విద్యా సంస్థల డైరెక్టర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కాగా నగరంలోని వివిధ ప్రాంతల నుంచి వినాయక విగ్రహాలు భారీగా నిమజ్జనానికి తరలివెళ్లాయి. ఇలా తరలివచ్చిన వినాయకులకు స్థానిక లీలామహల్ జంక్షన్ వద్ద తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో సాధర స్వాగతం పలికి హారతి పట్టారు. ఈకార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహ యాదవ్, ఉత్సవ కమిటీ కన్వీనర్ సామంచి శ్రీనివాస్, పీఆర్వో గుండాల గోపీనాధ్ రెడ్డి, సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, వూకావిజయ్‌కుమార్, ఆర్సీమునికృష్ణ, డాక్టర్ సంజయ్, నవీన్‌కుమార్ రెడ్డి, కె.అజయ్, కరాటే శ్రీనివాస్, గోపి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యేతోపాటుగా వినాయక సాగర్ వద్దకు చేరుకుని విగ్రహాల నిమజ్జనం తీరును పరిశీలించారు. ఎక్కడా ఎవరికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.

శోభాయమానంగా స్నపన తిరుమంజనం
తిరుపతి, సెప్టెంబర్ 15: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఆలయంలో బాదం, యాలకులు, వట్టివేరు, కొబ్బరిపూత, వెదురు బియ్యం, రోజాపూలు, తులసీమాలలు అలంకరణతో శోభాయమానంగా స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనే, చందనం, పసుపు, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. ప్రత్యేకమైన మాలల అలంకరణ స్వామి, అమ్మవార్ల తేజస్సును మరింత ఇనుమడింపచేసింది. వివిధ రంగుల పుష్పాలు, ఫలాలు, సాంబ్రాణి, ధూపదీప నైవేద్యాలతో ఈ తిరుమజనం సాగింది. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం ఆలపించారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ కొబ్బరిపూత, వెదురుబియ్యం మాలలు అలకరించినట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్నజీయర్ తదితరులు పాల్గొన్నారు.