S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చిన్న మొత్తాలపై పెరిగిన వడ్డీ రేటు

న్యూఢిల్లీ: అనేక సంవత్సరాల తరువాత చిన్న మొత్తాల పొదుపుపై వడ్డీ రేట్లు పెరిగాయి. ప్రభుత్వం నేషనల్ సేవింగ్స్ సర్ట్ఫికెట్ (ఎన్‌ఎస్‌సీ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతాలు సహా చిన్న మొత్తాల పొదుపు ఖాతాలలోని సొమ్ముపై అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వరకు వడ్డీ రేట్లను పెంచింది. బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరగడం వల్ల అందుకు అనుగుణంగా చిన్న మొత్తాల పొదుపుపై ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచింది. చిన్న మొత్తాల పొదుపును ప్రోత్సహించేందుకు, సీనియర్ సిటిజన్లు, ఆడ పిల్లల సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న మొత్తాల పొదుపుదారులకు మద్దతిచ్చేందుకు ఈ వడ్డీ రేట్లను పెంచినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. చిన్న మొత్తాలపై ఈ సంవత్సరం అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో వడ్డీ రేట్లను 0.3-0.4 శాతం వరకు పెంచినట్లు ఆయన మరో ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. ‘ఆడ పిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు, వృద్ధుల ఆర్థిక భద్రతను మెరుగు పరచడానికి ఈ చర్య తోడ్పడుతుంది’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల అక్టోబర్ ఒకటో తేదీ నుంచి సుకన్య సమృద్ధి యోజనపై వడ్డీ రేట్లు ఇప్పటి వరకు ఉన్న 8.1 శాతం 8.5 శాతం వరకు పెరుగుతాయి. సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీంపై వడ్డీ రేట్లు 8.3 శాతం నుంచి 8.7 శాతానికి పెరుగుతాయి. 2012 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దాదాపు అన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గుతూ వచ్చాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగులకు సంబంధించిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లో పొదుపు చేసుకున్న సొమ్ముపై వడ్డీ రేటు ఇప్పటి వరకు ఉన్న 7.6 శాతం నుంచి 8శాతానికి పెరిగింది. 2012 ఏప్రిల్ ఒకటో తేదీనాటికి పీపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటు అత్యధికంగా 8.8 శాతం ఉండింది. అప్పటి నుంచి వాటిపై వడ్డీ రేటు క్రమంగా తగ్గుతూ వచ్చింది. పీపీఎఫ్ డిపాజిట్లకు ఆదాయపు పన్ను (ఇన్‌కమ్ టాక్స్) చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంది. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ)పై వడ్డీ రేటు 7.3 శాతం నుంచి 7.7 శాతానికి పెరిగింది. వడ్డీ రేటు 0.4 శాతం వరకు పెరగడంతో కిసాన్ వికాస్ పత్రాలు గతంలో నిర్ణయించిన 118 నెలలకు బదులుగా ఇప్పుడు 112 నెలలకే మెచ్యూరిటీకి వస్తాయి.