S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సివిల్ సప్లైస్ గోదాములపై విజిలెన్స్ తనిఖీలు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: జిల్లాలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏకకాలంలో గురువారం సివిల్ సప్లైస్ గోదాములపై మెరుపు తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర విజిలెన్స్ డీజీ గౌతం సవాంగ్ ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లా విజిలెన్స్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు ఆధ్వర్యంలో ఏకకాలంలో విస్తృత దాడులు నిర్వహించారు. మండలస్థాయి నిల్వల కేంద్రాలను (ఎంఎల్‌ఎస్ పాయింట్లు) పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. పిఠాపురం, గొల్లప్రోలు, తుని, కాకినాడ, వేళంగి, ముమ్మిడివరంలలో ఎంఎల్‌ఎస్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలు చేయకపోవడం, రేషన్ దుకాణాలకు సరుకులు సరఫరా చేస్తున్న వాహనాలకు ఫ్లెక్సు లేకుండా రవాణా అవ్వడం, కొన్ని చోట్ల స్టాకు రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం వంటి లోపాలు గుర్తించారు. పూర్తి తనిఖీ నివేదికను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామని ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలిపారు. పెద్ద ఎత్తున సాగిన ఈ తనిఖీల్లో విజిలెన్స్ అధికారులు బి సాయి రమేష్, వై సత్య కిషోర్, రత్నకుమార్, గోపాలరావు, జె భార్గవ మహేష్, రామకృష్ణ, షేక్ వల్లీ, రంగకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

నన్నయలో ఎంపోరియం-2కె18 సందడి
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగం ఆధ్వర్యంలో రాష్టస్థ్రాయి కామర్స్ ఫెస్ట్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమాన్ని ఆచార్య ఎస్ టేకి, ఓఎన్జీసీ ఐటి జనరల్ మేనేజర్ ఎ బాలాజీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫెస్ట్ డైరెక్టర్ ఆచార్య ఎస్ టేకి మాట్లాడుతూ కామర్స్ అనేది ప్రతీ మానవ జీవితంలో అత్యవసరమని, విద్యార్థులకు విజ్ఞాన వినోద కార్యక్రమాల వల్ల ఉత్తేజంగా ఎదగగలరని అన్నారు. యూనివర్సిటీలోని ఇటువంటి కామర్స్ ఫెస్ట్‌లు వల్ల విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాలు, పరిజ్ఞాన పెంపు, కామర్స్, అకౌంట్స్‌లో నూతన పోకడలు బహిర్గతమవుతాయని, మానవ వనరుల సంబంధాలు మెరుగుపడతాయన్నారు. ఈ ఫెస్ట్‌కు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎం కామ్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్ధులు, బికాం తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. వెయ్యి మంది విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారన్నారు. ఓఎన్జీసీ ఐటీ జీఎం బాలాజీ విద్యార్థులను అభినందించారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌కు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. వివిధ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ పి ఉమామహేశ్వరిదేవి, కో డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ ఉదయ్ భాస్కర్, డాక్టర్ రమేష్ మోటూరి, ఎంఎస్‌జి అలైస్ జాయ్, ఎ శ్రీనివాసరావు, డాక్టర్ డి జ్యోతిర్మయి, డాక్టర్ రమణేశ్వరి, జి రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ ఎ ఎస్ రాజు, జె రవిశంకర్, ఎం జోహార్ కృష్ణ, వి వెంకటేశ్వర్లు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

సివిల్ సప్లై గోడౌన్స్‌లో విజిలెన్స్ తనిఖీలు
తుని, సెప్టెంబర్ 20: మండలంలో రేకవానిపాలెంలో గల సివిల్ సప్లై గొడౌన్స్‌పై గురువారం విజిలెన్స్ బృందం తనిఖీలు నిర్వహించింది. సీఐ సాయిరాం నేతృత్వంలో బృందం గోడౌన్‌లోగల సరుకును నిశితంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డుల్లో ఉన్నట్లే ఇక్కడ బియ్యం నిల్వలు ఉన్నాయని గుర్తించారు. అయితే ఒక లారీకి మాత్రం నెంబర్ ప్లేట్ లేకపోవడాన్ని అధికారులు గమనించారు. తనికీ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విజిలెన్స్ సీఐ సాయిరాం తెలిపారు. కార్యక్రమంలో మైనింగ్ ఏజీ రంగనాయకులు, కానిస్టేబుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.