S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

2019 ఎన్నికల్లో విజయమే బీజేపీ లక్ష్యం

కాకినాడ, సెప్టెంబర్ 20: 2019 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సురేష్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న కళ్యాణమండపంలో ఆయన విలేఖర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి 356 ఎంపీ సీట్ల గెలుపే లక్ష్యం కాగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని జోస్యం చెప్పారు. బిజెపి కొన్ని రాష్ట్రాల్లో ఒక్క సీటు లేకుండా విజయాన్ని సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలం చెందిందని వచ్చే అక్టోబర్ నెల నుండి బిజెపి ప్రచారం చేయనున్నామన్నారు. పట్టిసీమ నుండి ఇసుక, భూ, లిక్కర్ మాఫియాలకు అధికార ప్రభుత్వం వత్తాసు పలుకుతోందన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి తన కొడుక్కి మాత్రమే జాబు వచ్చిందన్నారు. ఎన్నికలు దగ్గరపడుతుడడంతో అన్న కేంటీన్లు, నిరుద్యోగ భృతి వంటి పధకాలను ముందుకు తెచ్చారన్నారు. జన్నభూమి కమిటీల పేరిట పధకాలు వారి అనుకూలురుకే అందిస్తు ప్రజాస్వామ్య వ్యవస్ధకు భంగం కలిగిస్తోందన్నారు. రాష్ట్రంలో టిడిపి పాలనకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, రంబాల వెంకటేశ్వరరావు, యాళ్ళ దొరబాబు, కె భీమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్న ఆర్‌జేసీ
అయినవిల్లి, సెప్టెంబర్ 20: వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆర్‌జేసీ యాండ్ర త్రినాధరావు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయానికి వచ్చిన ఆర్‌జేసీకి ఆలయ ఈవో మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం త్రినాధరావు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చవితి ఉత్సవాల్లో 8వ రోజు అయిన గురువారం స్వామివారికి ప్రత్యేక హారతి కార్యక్రమంలో ఆర్‌జేసీ పాల్గొన్నారు. అనంతరం స్వామివారి ఆలయంలో చవితి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన పనులు ఆర్‌జేసీ పరివేక్షించారు. శుక్రవారంతో వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో సూదూర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు.

రైల్వే వంతెనలు భద్రం
* దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు మెగా వంతెనలు: దక్షిణ మధ్య రైల్వే ముఖ్య భద్రతా కమిషనర్ రామ్‌కృపాల్
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 20: గోదావరి నదిపై రాజమహేంద్రవరంలో నిర్మించిన వంతెనలు భద్రంగానే ఉన్నాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య భద్రతా కమిషనర్ రామ్‌కృపాల్ సంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం ఆయన రోడ్డుకంరైలు వంతెన, 3వ ఆర్చ్ రైలు వంతెనలను క్షుణ్ణంగా పరిశీలించారు. రామ్‌కృపాల్ వంతెనల నిర్వహణ, భద్రతపై పూర్తిస్థాయి సంతృప్తిని వ్యక్తం చేసినట్లు చీఫ్ వంతెనల ఇనస్పెక్టర్ బి అశోక్ వెల్లడించారు. వంతెనల నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆయన సూచించినట్లు చెప్పారు. ఆర్చ్‌వంతెనపై కూడా ఆందోళన అవసరం లేదన్నారు. ఆర్చ్ వంతెన పక్కనే 3వ ట్రాక్ నిర్మాణం, రోడ్డుకంరైలు వంతెనకు ప్రత్యామ్నాయంగా మరో వంతెన నిర్మాణంపై కూడా రామ్‌కృపాల్ అధికారులతో చర్చించారు. ఇప్పటికే ప్రత్యామ్నాయ వంతెనపై రైల్వేబోర్డుకు అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. కాగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రాజమహేంద్రవరంలోని రెండు వంతెనలు, కృష్ణా నదిపై నిర్మించిన మరో మూడు వంతెనలను అతి ప్రాముఖ్యమైన మెగా వంతెనలుగా రైల్వేశాఖ గుర్తించింది. రాజమహేంద్రవరంతో పాటు శాటిలైట్ రైల్వేస్టేషన్‌గా కడియం రైల్వేస్టేషన్‌ను కూడా అభివృద్ధి చేసే అంశాన్ని కూడా రామ్‌కృపాల్ అధికారులతో చర్చించినట్లు సమాచారం.