S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మహిళ హత్య, దోపిడీ కేసులో నిందితుల అరెస్టు

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 20: నగర శివారులోని పోలీస్టేషన్ పరిధిలో కొద్దిరోజుల క్రితం జరిగిన మహిళ హత్య, దోపిడీ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో అద్దెకుంటున్న ప్రియుడు, తన ప్రియురాలితో కలిసి హత్య చేసి నగలు దోచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాకీ డబ్బులు అడిగినందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. రాధానగర్‌లో నివాసముంటున్న కారుమూడి అంజలి (52) అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈనెల సెప్టెంబర్ 6న గుర్తు తెలీని వ్యక్తులు దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకెళ్లిన ఉదంతం తెలిసిందే. హతురాలి కుమార్తె మాడ వరలక్ష్మీ (34) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నున్న, సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టిన మీదట నిందితులను గుర్తించి అరెస్టు చేసి, సుమారు ఆరు లక్షలు విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బి రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుల అరెస్టుకు సంబంధించి ఆమె వివరాలు వెల్లడించారు. హత్యకు గరైన అంజలికి ఒక ఆడపిల్ల, ఒక మగ సంతానం. వివాహితులైన వీరు రాధానగర్‌లోనే మరోచో ట నివాసముంటున్నారు. అంజలి భర్త వెంకటరెడ్డి కొంతకాలం క్రితం చనిపోవడంతో రాధానగర్‌లోని తన స్వంత భవనం రెండో అంతస్తులో ఒంటరిగా నివాసముంటోంది. స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా సుమారు ఏడాది క్రితం ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన రాయని నాగ సురేంద్ర (28), సూరేపల్లి రూప (25) అనే ఇద్దరూ అంజలి ఇంట్లో అద్దెకు దిగారు. ఆటోడ్రైవర్ అయిన నాగ సురేంద్రకు అప్పటికే పెళ్ళయి ఉండగా భార్య తన ఇద్దరు పిల్లలను జూపూడిలోని అత్తగారింట్లో వదిలిపెట్టి రూపతో కొంతకాలంగా సహజీవనం సాగిస్తూ అప్పుడప్పుడు భార్య పిల్లల వద్దకు వెళ్ళి చూసి వస్తున్నాడు. అదేవిధంగా రూప కూడా మనస్పర్థల కారణంగా అమె భర్త, పిల్లలను వదిలి సురేంద్రతో ఉంటోంది. ఇదిలావుండగా అంజలి ఇంట్లో సురేంద్ర, రూప అద్దెకు దిగిన తర్వాత అంజలితో చనువుగా ఉంటున్నారు. ఈక్రమంలో వడ్డీ వ్యాపారం చేస్తున్న అంజలి వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. బాకీ తిరిగి ఇవ్వనందున నిలదీసినందుకు తరచూ అంజలితో గొడవ పడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే 5వ తేదీ రాత్రి జరిగిన ఘర్షణను పురస్కరించుకుని సురేంద్ర కోపోద్రిక్తుడై అంజలి ముఖంపై బలంగా గుద్దడంతో ముక్కునుంచి రక్త కారుతూ కుర్చీలో కూలబడిపోయింది. దీంతో పక్కన ఉన్న గుడ్డతో ముఖంపై అదిమి పెట్టడంతో చనిపోయింది. సురేంద్ర, రూప ఇద్దరూ కలిసి అంజలి మృతదేహాన్ని ఆమె గదిలోకి తీసుకువచ్చి మంచంపై పడేసి ఇల్లంతా చెల్లాచెదురు చేసి ఆమె ఒంటిపై, కబోర్డులో ఉన్న బంగారు నగలు దోచుకుని ఎవరో దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సృష్టించి జారుకున్నారు. ఎట్టకేలకు పోలీసులు దర్యాప్తులో నిగ్గు తేల్చి నిందితులిద్దరిని అరెస్టు చేసి సుమారు ఆరులక్షలు విలువైన 28కాసుల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో సీసీఎస్ ఎసీపీలు సుందరరాజు, వర్మ తదితరులు పాల్గొన్నారు.