S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

క్రీడాభివృద్ధికి ప్రతి ఏటా రూ. 300 కోట్లు

విజయవాడ, సెప్టెంబర్ 20: జాతీ య అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తయారు చేసే విధంగా క్రీడాభివృద్ధికి ప్రతి ఏటా రూ. 300 కోట్లు ఖ ర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి చం ద్రబాబు నాయుడు అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం నిర్వహించిన జ్ఞానభేరి కార్యక్రమంలో సీఎం కప్ లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీ ఎం మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి క్రీడానైపుణ్యాన్ని పెంపొందించి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్ది జాతీ య అంతర్జాతీయ పోటీల్లో రాణించే విధంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చే స్తున్న కృషిని అభినందించారు. గాంఢీ వం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో జాతీ య, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడానికి శ్రీకారం చుట్టామని దీనిలో భాగంగా నాగార్జున వర్శిటీలో గాంఢీవం ప్రాజెక్టు కింద క్రీడాకారులకు జమైఖ్య, సౌతాఫ్రికా నుండి కోచ్‌లను ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఈ ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 15, 17, 19 స్థాయిలో మం డల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి విజేతలకు రాష్ట్ర స్థాయి పోటీల్లో సీఎం కప్‌కు ఎంపిక చేయడం జరుగుతుందని విజేతలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ద్వారా జాతీ య, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో శాప్ అంకమ్మచౌదరి, వైస్ చైర్మన్ ఎండీ బంగారురాజు పాల్గొన్నారు.

అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణకు భయమెందుకు?
* వైకాపా నేత కొలుసు పార్థసారథి
విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 20: లక్షల మంది బాధితులున్న అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు వెనకాడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా చంద్రబాబుకు చలనం రావడం లేదన్నారు.

కొండపల్లి కోటేశ్వరమ్మకు ఘన నివాళి
పామర్రు, సెప్టెంబర్ 20: కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన దివంగత ప్రముఖ నక్సలైట్ నాయకుడు, పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య సతీమణి కొండపల్లి కోటేశ్వరమ్మ బుధవారం విశాఖపట్నంలో మృతి చెందటంతో స్వస్థలమైన పామర్రులో బుధవారం విషాద ఛాయలు అలుముకున్నాయి. పామర్రులో పుట్టి పెరిగి కొండపల్లి సీతారామయ్యను వివాహం చేసుకున్న కోటేశ్వరమ్మ అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో విరాళాల సేకరణకు పామర్రు విచ్చేసిన మహాత్మాగాంధీకి కోటేశ్వరమ్మ తన ఒంటిపై ఉన్న బంగారు నగలను విరాళంగా ఇచ్చి దేశక్తిని చాటుకున్నారు. కమ్యూనిస్టు ఉద్య మ నేతగా కోటేశ్వరమ్మ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేస్తూ పామర్రు ప్రాంతం లో ప్రత్యేక దళాన్ని నిర్వహించారు. కోటేశ్వరమ్మ మృతికి గురువారం స్థానిక నాలుగు రోడ్ల సెంటరులో ఆమె చిత్రపటానికి కమ్యూనిస్టు పార్టీ నేతలు బరిగెల భీమేశ్వరరావు, పి వెంకటేశ్వరరావు, ఆమె సమీప బంధువు వీరారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

విద్యావ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నారు
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ విద్యా వ్యవస్థను భ్రష్ఠు పట్టిస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి పవన్‌కుమార్ విమర్శించారు. విద్యా సంస్థల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జరిగింది. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రయత్నం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం చిలకలపూడి పోలీసు స్టేషన్‌కు తరలించి వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.