S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 20: వచ్చే అక్టోబర్ 10నుండి 18వరకు 9రోజులుపాటు 21గంటల పాటు అమ్మవారిని భక్తులకు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మ, చైర్మన్ వీ గౌరంగబాబు తెలిపారు. దేశం నలుమూలల నుంచే వచ్చే భక్తులు ఈమహోత్సవాల్లో దర్శనం చేసుకునేందుకు వీలుగా ఈఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ అంతస్తులో గురువారం సాయంత్రం విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తొలి రోజైన అక్టోబర్ 10న అమ్మవారి స్నపనాభిషేకం తర్వాత ఉదయం 9గంటల నుండి భక్తులను అమ్మవారి దర్శనం నిమిత్తం అనుమతించటం జరుగుతోందన్నారు. రెండో రోజు నుండి వేకువ జామున 3గంటల నుండి రాత్రి 11గంటల వరకు అమ్మవారి దర్శనం ఉండేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇందులోభాగంగా చివరి రోజైన 18న సాయంత్రం 5గంటలకు అమ్మవారికి అత్యంత వైభవంగా పవిత్ర కృష్ణనదీలో తెప్పోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కెనాల్‌రోడ్ వినాయకుడి వద్ద ప్రారంభమైన క్యూమార్గం వద్దకు భక్తులు చేరుకుని ఈమార్గం గుండా ఘాట్‌రోడ్ మార్గం గుండా కొండపైకి చేరుకొని అమ్మవారిని దర్శనం చేసుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద కేశఖండనశాల, రాజీవ్‌గాంధీ పార్క్ వద్ద క్లోక్ రూమ్, చెప్పుల స్డాండ్, మైక్ ప్రచార కేంద్రం, ఉచిత బస్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా దివ్యాంగులు కొండపైకి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకోనే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయటంతోపాటు, వీఐపీల కోసం ప్రత్యేకంగా పున్నమిఘాట్ నుండి ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మల్లిఖార్జున మహామండపం పక్కనే ప్రతిరోజు సాయంత్రం నుండి రాత్రి వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఏర్పాటు, క్యూమార్గాల్లో వేచి ఉన్న భక్తులకు మంచినీటి సదుపాయం, పిల్లలకు పాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్న ప్రసాదం పంపిణీతోపాటు అదనపు ప్రసాదాల కౌంటర్ల ఏర్పాటు, మైక్ ప్రచారం కేంద్రంతోపాటు ఎన్‌సిసి విద్యార్థుల సేవలను భక్తుల అవసరాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాదాపుగా గత సంవత్సరం ఏర్పాటు చేసినట్లే ఈఏడాది కూడా భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈసమావేశంలో ఆలయ కమిటీ ధర్మకర్తలు వెలగపూడి శంకరబాబు, పెంచలయ్య, సాంబశివరావు, స్థానాచార్యుడు విష్ణు బొట్ల శివప్రసాద్, లింగంబొట్ల దుర్గా ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.