S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

దేశాభ్యున్నతికై యువత కార్యోన్ముఖులు కావాలి

మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 20: దేశాభ్యున్నతికి యువత కార్యోన్ముఖులు కావాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. ఆయన పట్టణంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులతో గురువారం భేటీ అయ్యారు. హిందూ కళాశాల, మాస్టర్ ఇకె బాలభాను విద్యాలయం, ఆర్‌కె జూనియర్ కళాశాలలో ముఖాముఖి నిర్వహించారు. మచిలీపట్నం పూర్వ విద్యార్థుల కలయిక ఆధ్వర్యంలో హిందూ కళాశాల ఆడిటోరియంలో విద్యా ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. మంచి దృక్పధం, క్రమశిక్షణ, దేశభక్తి కలిగిన యువతతోనే దేశ ప్రగతి సాధ్యమన్నారు. మహాత్మా గాంధీ, స్వామి వివేకానందుడి వలే ధైర్య సాహసాలను పెంపొందించుకోవాలని హితవు పలికారు. పాఠ్యాంశాలతో పాటు ఇతర విషయాలను కూడా తెలుసుకోవాలన్నారు. అవినీతి రహిత సమాజ నిర్మాణంలో యువత పాత్రే కీలకమన్నారు. విమానంలో ప్రయాణం చేసేటప్పుడు భూమి మీద ఉన్న ఇళ్లు చిన్నవిగా కనిపించినట్లు ఉన్నత ఆలోచనలతో పెద్ద పెద్ద సమస్యలు చిన్నవి అయిపోతాయన్నారు. పాఠ్యాంశాలతో పాటు జన్మస్థలం, మహనీయుల జీవిత విశేషాలను తెలుసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదని, ఎలా జీవించామన్నదే ముఖ్యమన్నారు. బురదలో జన్మించిన తామర పువ్వు దేవుడి పాదాల వద్దకు చేరుతుందన్నారు. మహాభారతంలో ద్రోణాచార్యుడు పెట్టిన పరీక్షలో నెగ్గిన అర్జునుడి వలే ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలన్నారు. పూర్వ రాష్టప్రతి, మిసైల్ శాస్తజ్ఞ్రుడు అబ్దుల్ కలాం స్ఫూర్తితో సృజనాత్మకమైన ఆలోచనలు పెంపొందించుకోవాలన్నారు. గత మార్చిలో జరిగిన పదవ తరగతి పరీక్షల్లో 10/10 పాయింట్లు సాధించిన పురపాలక సంఘ ఉన్నత పాఠశాల, ఆర్‌సీఎం హైస్కూల్ విద్యార్థులకు రూ.50వేలు చొప్పున నగదు ప్రోత్సాహకాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల గిరీష్, దొరరాజు, హిందూ కళాశాల అనుబంధ సంస్థల పాలకవర్గ అధ్యక్షుడు డా. బి ధన్వంతరి ఆచార్య, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమరగిరి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

నీరు లేక నెర్రలిచ్చిన చేలు
* వెల్లటూరు బంద్ చెరువు కింద సాగునీటి సమస్య
జి.కొండూరు, సెప్టెంబర్ 20: వెల్లటూరు బంద్ చెరువు కింద సాగునీటి సమస్యతో వరిపైరు ఎండిపోతున్నది. ఈ చెరువు కింద దాదాపు 370 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఖరీఫ్ ఆరంభంలో ముసురు పట్టి వర్షాలు కురవటంతో రైతులు వరిసాగుకు శ్రీకారం చుట్టారు. కాలక్రమంలో వర్షాలు లేక చెరువులో నీరు ఎండిపోయంది. చెరువుకు గోదావరి జలాలను మళ్ళించే ఎత్తిపోతల పథకం సామర్థ్యం సరిపోనందునే ఈ సమస్య తలెత్తినట్టు తెలిసింది. వెలగలేరు వద్ద పోలవరం కుడిప్రధాన కాలువపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషి కారణంగా మోటార్లను ఏర్పాటు చేశారు. కానీ దీనికి 7 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతోంది. అందువల్ల సాగునీటి పంపింగ్ సవ్యంగా జరగటం లేదు. చెరువులో ఉన్న గోతుల్లోని కొద్దిపాటి నీటిని పొక్లెయిన్ సాయంతో చెరువులోనే చిన్న చిన్న కాలువలు తవ్వి నీటిని తూముల వద్దకు మళ్ళించడానికి రైతులు భగీరథ యత్నాలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న రైతులు మాత్రం డీజిల్ ఇంజన్లను చెరువులో అమర్చుకుని పైపుల ద్వారా వరికి సాగునీరు పెడుతున్నారు. దీనికి నిరంతరం కరెంటు సరఫరా చేసి గోదావరి నీటిని ఎక్కువగా ఎత్తిపోసి ఎండిపోతున్న వరిపైరును రక్షించాలని రైతులు మంత్రి ఉమకు విజ్ఞప్తి చేస్తున్నారు.