S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఇసుక కొల్లగొడున్నారు

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 20: రొయ్యూరు ప్రభుత్వ ఉచిత క్వారీలో అక్రమంగా తెల్లవారుజామున ఇసుక కొల్లగొడుతున్నారని గురవారం ఉదయం కార్మికులు ఆందోళన చేశారు. కార్మికుల ఆందోళనతో ఉదయం 6 గంటల నుంచి 10.30 వరకు క్వారీలోకి ట్రాక్టర్లు వెళ్ళకుండా ఆగిపోవటంతో ట్రాక్టర్లు బారులు తీరాయి. కార్మికుడు లుక్కా రామారావు మాట్లాడుతూ రొయ్యూరు క్వారీలో అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. క్వారీలో స్లిప్‌లు ఇచ్చేవారు కొంతమంది కలసి రొయ్యూరు క్వారీలోకి తెల్లవారుజామున 3 గంటలకే ట్రాక్టర్ల వద్ద రూ.100లు తీసుకుని టోకెన్ లేకుండా పంపిస్తున్నారన్నారు. లోపల కొంతమంది రూ.400 తీసుకుని ట్రాక్టర్‌కు లోడింగ్ చేస్తున్నారని తెలిపారు. ఈ విధంగా ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సుమారు 500 నుంచి 600 ట్రాక్టర్లకు లోడింగ్ చేస్తున్నారని చెప్పారు. ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళిన పట్టించుకోకపోవటంతో కార్మికులతో ఆందోళన చేశామని రామారావు తెలిపారు. ఈ క్వారీలో సుమారు 1000 మంది కార్మికులు బతుకుతున్నారని, రోజుకు రొయ్యూరు క్వారీకి సుమారు 1500 నుంచి 1800 టాక్టర్లు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంలో క్వారీలోకి వెళ్ళేటప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ రూ.330 చెల్లించి స్లిప్ తీసుకుని క్వారీలోకి వెళ్ళి లోడింగ్ చేసుకుంటారని తెలిపారు. క్వారీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయాలని తెలిపారు. కాని నిబంధనలకు విరుద్దంగా కొంతమంది పలుకుబడితో తెల్లవారుజామున 3 గంటల నుంచే ట్రాక్టర్లుకు లోడింగ్ చేస్తు వచ్చిన డబ్బులను పంచుకుంటున్నారని కార్మికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మురళీ, తహశీల్దార్ జి భద్రు వచ్చి కార్మికులతో మాట్లాడి క్వారీలోకి ట్రాక్టర్లను పంపించి లోడింగ్ చేయించారు.