S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మోదీ సంరక్షకుడా, దొంగనా?

దుంగర్‌పూర్(రాజస్థాన్), సెప్టెంబర్ 20: ప్రధాని నరేంద్రమోదీపై ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శల పరంపర కొనసాగుతోంది. దేశ సంరక్షకుడుగా చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు దొంగని ప్రజలు భావిస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఇక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రాఫెల్ ఫైటర్ జెట్స్ స్కాం గురించి వివరాలు వెల్లడించడానికి ప్రధాని నరేంద్రమోదీ నిరాకరిస్తున్నారన్నారు. బ్యాంకులను మోసం చేసిన కేసులో పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా దేశం విడిచివెళ్లేందుకు బీజేపీ సర్కార్ సహకరించిందన్నా రు. ఈ విషయమై ప్రధాని మోదీ నోరు విప్పరెందుకని నిలదీశారు. రాఫెల్ ఎయి ర్ క్రాఫ్ట్స్ కొనుగోళ్లపై నిలదీస్తే పార్లమెంటులో మోదీ స్పందించలేదన్నారు. మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారన్నారు. బీజేపీ పాలన తో ప్రజలు విసిగిపోయారని, కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌కు పట్టం కట్టాలనే తాపత్రయంతో ఉన్నారన్నారు. ప్రధానమంత్రి లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా డబ్బు ప్రభావం వల్ల కాంగ్రెస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలు ఏమి చెబుతున్నారో వినేందుకు మోదీ సిద్ధంగా లేరన్నారు. ప్రతి ఏడాది రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తానన్న హామీ ఏమైందన్నారు. ప్రతి రోజూ దేశంలో 450 మందికి మాత్రమే ఉద్యోగం కల్పిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో స్ధానిక కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థిని నిర్ణయిస్తారన్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని అడ్డదార్లు తొక్కుతోందన్నారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీతో దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారన్నారు. ఒక దేశం, ఒక పన్ను విధానాన్ని ప్రవేశపెట్టమని కోరితే బహుళ పన్నుల విధానాన్ని ప్రధాని మోదీ దేశానికి కానుకగా ఇచ్చారన్నారు. తమ పార్టీని గెలిపిస్తే బహుళ పన్నుల విధానానికి స్వస్తి చెప్పి దేశమంతా ఒకే పన్ను విధానాన్ని అమలు చేస్తామన్నారు.

చిత్రం..పార్టీ సంకల్ప్ ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ