S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సర్కారుతో కలిసి వచ్చే నెల 7న అతి పెద్ద క్యాన్సర్ రన్

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వచ్చే నెల 7న నగరంలోని నెక్లెస్ రోడ్డు, జలవిహార్ వద్ద క్యాన్సర్ రన్ నిర్వహించనున్నట్లు గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ప్రకటించింది. దేశంలోనే అతి పెద్ద క్యాన్సర్ రన్ నిర్వహణకు సంబంధించిన వివరాలను ఫ్యాషన్ డిజైనర్, మోడల్ శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా దీపా సక్సెనా, రోబోటిక్ సర్జికల్ అంకాలజిస్టు, మారథానర్, రేస్ డైరెక్టర్ డాక్టర్ హేమంత్ ఉదయ రాజు, ఆరోరా గ్రూపు విద్యా సంస్థల చైర్మన్ రాజా బాబు, గ్రీన్‌కో విపి దివాకర్, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, సిఇవో డాక్టర్ చిన్నబాబు సుంకపల్లి విలేఖరుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ క్యాన్సర్ రన్‌లో తానూ పాల్గొంటానని చెప్పారు. శారీరక కదలిక లేకుండా నిశ్చలనంగా ఉండే జీవితం వల్లే క్యాన్సర్‌తో పాటు అనేక రోగాలకు దారి తీస్తున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన ఆహారానే్న తీసుకోవాలని ఆమె సూచించారు. దీపా సక్సెనా మాట్లాడుతూ తాను రెండు సార్లు క్యాన్సర్ నుంచి ప్రాణాలతో బయటపడ్డానని చెప్పారు. భయంకరమైన క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రన్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆమె కోరారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని దీపా సక్సేనా అభినందించారు. డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి మాట్లాడుతూ క్యాన్సర్‌పై పోరాడుతున్న వారికి మద్దతుగా ఈ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించినట్లయితే చికిత్స అందించి జయించవచ్చన్నారు.

దంత వైద్యుల పట్ల దుష్ప్రచారం: ఐడిఎ
తెలంగాణ డెంటిస్ట్ అసోసియేషన్ ముసుగులో కొంత మంది కుట్రపూరితంగా దంత వైద్య నిపుణులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (ఐడిఎ) డెక్కన్ బ్రాంచ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ ఆరోపణలను ఖండిస్తున్నట్లు ఐడిఎ తెలిపింది. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు వివరించింది.
గ్రాబాన్ లక్ష్యం..
2020 నాటికి గిఫ్ట్ కార్డ్స్ ప్రపంచంలో 40 శాతానికి పైగా గెలుచుకోవడం తమ లక్ష్యమని గ్రాబాన్ వ్యవస్థాపకుడు, సీఇవో అశోక్‌రెడ్డి తెలిపారు. కొత్త వెంచర్ 20 శాతం లాభాల మార్జిన్లను సాధించగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏవియేషన్, బ్యాంకింగ్, కమ్యూనికేషన్, వినోదం వంటి వివిధ వర్టికల్స్ వ్యాప్తంగా అగ్రగాములలో అనుసంధానాలు కలిగి, కూపనింగ్ ప్రపంచాన్ని గ్రాబాన్ విజయవంతంగా ఏలిందన్నారు.