S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సుప్రీం కోర్టంటే పెద్దపులేమీ కాదు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: సర్వోన్నత న్యాయస్థానంలో కేసులు పెండింగ్ ఉన్నాయనే భావనతో కోర్టంటే మనుషులను తినే పులులను చూసినట్లు భయపడరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు అంటే భయపపడాల్సిన అవసరం లేదని, మేమేమీ పెద్ద పులులం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ సంస్థకు సంబంధించిన లీజును సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం మైనింగ్ లీజు వ్యవహారంపై ఏపికి సంబంధించి దాఖలైన పిటిషన్లను విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ సంస్థకు మైనింగ్ నిమిత్తం మంజూరు చేసిన లీజును సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ టైమెక్స్ గ్రూపు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్టగి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సంస్థకు మంజూరు చేసిన లీజును పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ రిటైర్డు ఐఎఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ముకుల్ వాదనలు వినిపిస్తూ ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్నందు వల్ల తమ సంస్థకు మంజూరు చేసిన లీజును సస్పెండ్ చేసినట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై పిటిషనర్ తరఫున న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ, రాష్ట్రప్రభుత్వం లీజునుసస్పెండ్ చేసిందని, కాని లీజును రద్దు చేయాలని అభ్యర్థించారు. దీనిపై ముకుల్ వాదనలు వినిపిస్తూ తమ సంస్థకు మంజూరు చేసిన లీజును రద్దు చేసేందుకు వత్తిడి చేసే విధంగా పిటిషనర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. తమ సంస్థకు లీజు మంజూరు అక్రమమేమీ కాదన్నారు. అందుకే తాము సస్పెన్షన్ ఉత్తర్వులను సవాలు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని రాష్ట్రప్రభుత్వం ఒకళిద్దరికి వత్తిళ్లకు లొంగి ఇటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉండరాదని పేర్కొంది. అనంతరం ఈ కేసు విచారణను ఈ నెల 27వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. కాగా ఈ ఏడాది జూలై 9వ తేదీన ఈఎఎస్ శర్మ సుప్రీంకోర్టులో టైమెక్స్‌గ్రూపుకు మైనింగ్ లీజు మంజూరును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించాలంటూ సుప్రీంకోర్టు కేంద్రం, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. అక్రమ మైనింగ్‌కు పాల్పడేందుకు ఈ లీజు ఉపయోగపడుతుందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అణు ఇంధన చట్టం 1962లో ప్రస్తావించినట్లుగా మోనజైట్, పదార్థం ఈ లీజు మైనింగ్ ప్రాంతంలో ఉందని పేర్కొన్నారు. ఇక్కడ మైనింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందని పేర్కొన్నారు. మైనింగ్ లైసెన్సును రద్దు చేయాలని పిటిషనర్ కోరారు.