S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఆపరేషన్ సహస్ర ‘విజయ’వంతం

గుంటూరు (అరండల్‌పేట) సెప్టెంబర్ 21: 20 గంటలు.. మూడు ప్రత్యేక బృందాలతో వసంతరాయకాలనీ, శారదా కాలనీలలో పోలీసులు ప్రతి ఇల్లు జల్లెడ పట్టడం.. నగరంలోని అన్ని సీసీ కెమేరాల పరీశీలనకు స్పెషల్‌టీమ్‌లు.. స్వయంగా రంగంలోకి దిగిన ఆర్బన్ పోలీసు బాస్..సీన్ కట్ చేస్తే ఇంటి వద్ద అడుకుంటూ అదృశ్యమైన పసిపాప తల్లి ఒడికి చేరి తల్లిదండ్రుల మోములో ‘విజయ’ దరహసం. వివరాల్లోకి వెళితే ఈ నెల 20న వసంతరాయకాలనీకి చెందిన బాలిక సహస్ర ఇంటి వద్ద అడుకుంటూ కనిపించకుండా పోయిన నేపధ్యంలోఅర్బన్ పోలీసులు నిర్వహించిన అపరేషన్ సహస్ర విజయవంతం అయింది. కేవలం 20గంటల్లోనే ఇంటి నుంచి తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగించి మరోసారి ఆర్బన్ పోలీసులు సత్తాను చాటుకుని కేసులను వేగంగాపరిష్కరించడంలో తమకు సాటిలేదని మరోమారు నిరుపించారు. గురువారం మద్నాహ్నం గుంటూరు వసంతరాయపురానికి చెందిన రాజనాయరణ, అరుణ దంపతుల కుమార్తె సహస్ర ఇంటి వద్ద అడుకుంటు కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం అరండల్‌పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన వెంటనే అరండల్‌పేట పోలీసులు విషయాన్ని ఆర్బన్ ఎస్పీ విజయారావు దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో రంగంలోకి దిగిన విజయారావు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందిని అదేశించి 20రాత్రి అపరేషన్ సహస్ర రూపోందించారు. వేగంగా స్పందించిన ఎస్పీ..వెస్ట్ డిఎస్పీ సౌమ్యలతనేతృత్వంలో మూడు స్పెషల్ టీమ్‌లకు అప్పటికప్పుడు ఎర్పాటు చేశారు. యుద్ద ప్రాతిపాదికన తప్పి పోయిన బాలిక ఫోటో ఉన్న పోస్టర్లును వేయించి నగరంలోని ప్రధాన కూడళ్ళలలో అంటించారు. అంతే కాకుండా ఆర్బన్ పోలీసు పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తంచేశారు. పాప కోసం జల్లెడ పడుతున్న పోలీసులకు శారద కాలనీలో వివాహం కోసం వచ్చిన వెనిగండ్లకు చెందిన ఎసమ్మ.. పాప వద్ద ఎవరు లేకపోవడం చూసి తనతోనే ఉంచుకుంది. నగరంలో ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్న పోలీసులు పాపను గుర్తించి ఎసమ్మ వద్ద నుంచి పాపను తీసుకుని ఆర్బన్ ఎస్పీ విజయారావుకు అప్పగించారు. ఆర్బన్ ఎస్పీ బాలిక తల్లిదండ్రులను పిలిపించి పాపను వారికి అప్పగించారు.
అర్బన్ పోలీసింగ్ అదుర్స్..
పసిపాప మిస్సింగ్ కేసుకు సంబంధించి ఫిర్యాదు అందినప్పటి నుంచి ఆర్బన్ పోలీసు బాస్ విజయారావు వ్యవహరించిన తీరు పట్ల ప్రజలు ప్రశంశలు కురిపిస్తున్నారు. 20న సాయంత్రం కేసు నయోదు చేసిన వెంటనే విజయారావు తన కార్యాలయంలో ప్రత్యేక సమావేవం ఎర్పాటు చేసి అపరేషన్ సహస్ర ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సాధ్యమైనంత వేగంగా పసిపాపను తల్లిచెంతకు చేర్చాలని అదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విరిగా వాడుకోవాలని సూచించారు. ఎప్పటి కప్పుడు కేసు పురోగతిని తనకు వివరిచాలని అధికారులకు తెలిపారు. ఈ క్రమంలో పోలీస్‌బాస్ తీసుకున్న నిర్ణయాలు కేసును చేదిస్తున్న అధికారులను సైతం అశ్చర్యం పోందేలా చేశాయి. పోలీస్ బాస్ స్వయంగా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించడంతో అధికారులకు కూడా వేగంగా కదిలారు. బాలిక అచూకి తెలిసే వరకు అయన కంట్రోల్ రూమ్‌లో నుంచి బయటకు రాలేందటే అయన పసిపాప కోసం పడ్డ తపన అర్దమయ్యిందంటున్నారు సాటి సిబ్బంది. అంతే కాకుండా రాత్రి నుంచి అర్బన్ పరిధిలోని పోలీసు స్టేషన్ అధికారులను సమన్వయ పరచుకుంటూ మరో చక్కటి విజయాన్ని తమ సిబ్బందికి చేకూర్చేలా చేయడంలో సఫలమయ్యారు.