S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణను కొట్లాడి తెచ్చుకున్నాం

రామడుగు, సెప్టెంబర్ 21: తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నాం తప్పా.. కాంగ్రెస్ ఇచ్చింది కాదని టీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుంకె రవిశంకర్ అన్నారు. తెలంగాణ సాధనలో టిఆర్‌ఎస్ పాత్ర లేదని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మొహర్రం వేడుకలను పురస్కరించుకొని గుండిలో పీర్లకు దస్తీలు కట్టి మొక్కులు చెల్లించుకున్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఆనాడు వైఎస్‌కు భయపడి ఏ ఒక్క కాంగ్రెస్ నేత తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదన్నారు. రైలురోకో, మిలీనియం మార్చ్, వంటావార్పులు తదితర అనేక ఉద్యమాలతో తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవడం వల్ల 1200 మంది బలిదానాలకు కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ధ్వజమెత్తారు. సమావేశంలో గుండి ఎంపిటిసి ప్రవీణ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు సలావోద్దీన్, తాజా, మాజీ సర్పంఛ్ పొన్నం తిరుపతి, రంగు శ్రీను ఉన్నారు.
రామేశ్వర ఆలయం చైర్మన్‌గా భాస్కర్ రెడ్డి
సుల్తానాబాద్, సెప్టెంబర్ 21: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలోని రామేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉమ్మెత్త భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా పాల రామారావు, మొరపల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ధన్నమనేని కిషన్ రావు, సహాయ కార్యదర్శిగా వెయ్యిగళ్ల భూమయ్య, కోరుట్ల కృష్ణచారి, కోశాధికారిగా మ్యాకల రాజయ్య, ముఖ్య సలహాదారులుగా చీటి కేశవ రావు, మొరపల్లి మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని సన్మానించారు.