S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజగోపాల్‌కు షోకాజ్ నోటీసు

హైదరాబాద్, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ అధిష్ఠానం నియమించిన ఎన్నికల కమిటీల్లో బ్రోకర్లు ఉన్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియా శనిలా పట్టారని తీవ్ర ఆరోపణలు చేసిన ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి రాష్ట్ర నాయకత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. రెండు రోజుల్లో దీనికి సమాధానం చెప్పాలని ఆ నోటీసులో ఆదేశించింది. మరోపక్క శుక్రవారం సాయంత్రమే రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ దీనికి రెండు రోజుల గడువు ఎందుకు? అని ప్రశ్నించారు. తనకు నోటీసు ఇచ్చిన వారే దీనిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

అసలేం జరిగిందంటే..
ముందస్తు ఎన్నికలను ధీటుగా ఎదుర్కొవడానికి వీలుగా కాంగ్రెస్ అధిష్ఠానం ఇటీవల 9 వేర్వేరు కమిటీలను నియమించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచన మేరకు పార్టీ క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం. కోదండరెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలని నిర్ణయించింది. కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ తాను కరుడుగట్టిన కాంగ్రెస్ నాయకుడినని చెప్పారు. పదవులు అమ్ముకునేవారా? తనకు నోటీసు ఇచ్చేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు నోటీసు ఇచ్చిన వారే ఆత్మపరిశీలన చేసుకోవాలని ఎదురుదాడికి దిగారు. తాను ఇప్పటికీ పార్టీలోనే కొనసాగుతానని, తనకు ఎటువంటి పదవులు అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. గాంధీ భవన్‌లో ఏసీ గదుల్లో కూర్చుని మీడియాతో మాట్లాడే వారు, పదవులు అమ్ముకునే వారు తనకు షోకాజ్ నోటీసు ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ ప్రకటించిన కమిటీల్లో ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి పేరు ఉందంటే రాష్ట్ర నాయకత్వం నిద్ర పోతున్నదా? అని రాజగోపాల్‌రెడ్డి నిలదీశారు. 70 ఏళ్లు నిండిన వారికి టిక్కెట్లు ఇవ్వడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలబెట్టనున్నారని కాంగ్రెస్ నేత తీవ్ర ఆరోపణ చేశారు. ‘షోకాజ్ నోటీసుకు రెండు రోజుల గడువు అవసరం లేదు. నేను చేసిన వ్యాఖ్యలన్నీ పార్టీ కార్యకర్తల మనోభావాలే’ అని ఆయన వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకుంటున్నానని రాజగోపాల్ రెడ్డి మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.