S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నడక (సండేగీత)

నడక ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు.
అందులో ఎలాంటి సందేహం లేదు.
ఒక శారీరక ఆరోగ్యానికే కాదు - మానసిక ఆరోగ్యానికి కూడా అది ఎంతో మంచిని కలుగజేస్తుంది.
మనం పార్క్‌ల్లో నడుస్తున్నప్పుడు ఎన్నో విషయాలని గమనించవచ్చు.
పక్షుల కిలకిలారావాలు వినవచ్చు. మనుషులని చూస్తూ నడవచ్చు. వారి వేషధారణలని గమనించవచ్చు.
విచ్చుకున్న పుష్పాన్ని చూడవచ్చు.
అక్కడున్న చెట్ల నీడలని గమనించవచ్చు. సూర్యకాంతిని అనుభవించవచ్చు.
కాలనీల్లో, గేటెడ్ కమ్యూనిటీల్లో నడుస్తున్న వ్యక్తులు ఇరుగుపొరుగు వాళ్ల ఇంటి ముందు వున్న చెట్లని చూస్తూ నడవచ్చు.
మంచి గాలిని పీల్చుకోవచ్చు.
ఉదయం పూట నడకలో ఎన్నో కన్పిస్తాయి. ఎన్నో విన్పిస్తాయి.
కొంతమంది పాటలు వింటూ నడుస్తారు. మరి కొంతమంది సంభాషణలని, యూట్యూబుల్లో వింటూ నడుస్తారు.
ఉదయానే్న కాదు.
మన మూడ్ బాగా లేనప్పుడు కూడా అలా ఇంటి నుంచి బయటకి నడవాలి.
మనకన్నా ఎక్కువ కష్టాల్లో వున్నవాళ్లు బతుకు కోసం ఏ విధంగా కష్టపడుతున్నారో చూడవచ్చు. మనకున్న కష్టం చాలా చిన్నదిగా కన్పిస్తుంది.
ఎప్పుడు నడిచినా, ఫోన్ మాట్లాడుతూ నడిస్తే మనం ఏమీ గమనించలేం. ఏమీ చూడలేం.
వేటినీ దర్శించలేం.
ఫోన్ మాట్లాడుతూ అలా నడిస్తే ఎన్నో ఆలోచనలు వస్తాయి. అవి మనల్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగపడతాయి. మన మిత్రులని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడతాయి.
నడక వల్ల మన మూడ్ మారుతుంది.
కొత్త ఆలోచనలు వస్తాయి.
ఆలోచనల నుంచి ప్రశ్నలు ఉద్భవిస్తాయి.
ప్రశ్నలు ప్రగతికి మార్గం చూపుతాయి.
అయితే రోజుకి ఎన్నిసార్లు మనం నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం..?

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001