S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

వారం వారం గోచారం (23-9-2018 నుంచి 29-9-2018 వరకు)

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆదివారం లాభాలున్నా సౌఖ్య లోపం కనిపిస్తుంది. గృహ వాహనాది వ్యవహారాలు ప్రభావితం చేస్తాయి. ప్రయోజన దృష్టిని తగ్గించుకోవాలి. ఆహార విహారాలపై ఆసక్తి అధికవౌతుంది. సోమవారం భాగస్వామ్య లాభాలుంటాయి. పరిచయాలు, అనుబంధాలు విస్తరించే అవకాశం. పెద్దల ఆశీస్సులుంటాయి. మంగళవారం ఖర్చులు పెట్టుబడులపై దృష్టి. అసంతృప్తి ఉంటుంది. ఆధ్యాత్మిక వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. బుధవారం వ్యతిరేకతలున్నా విజయం సాధిస్తారు. సృజనాత్మకత ఉంటుంది. విశ్రాంతి కోసం ప్రయత్నిస్తారు. గుర్తింపు. గురువారం ఆత్మవిశ్వాసంతో కార్యనిర్వహణ చేసే ప్రయత్నం. వృత్తి ఉద్యోగాదుల్లో శ్రమాధిక్యం. అధికారిక వ్యవహారాలపై దృష్టి. శుక్రవారం బాధ్యతలు అధికం. పరిచయాలు, స్నేహానుబంధాలు, ప్రేమానురాగాలు పెరిగే సమయం. సంతోషం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)

ఆదివారం భాగస్వామ్య వ్యవహారాలపై దృష్టి. పరిచయాలు, అనుబంధాలు విస్తరిస్తాయి. విశ్రాంతి లోపం. కాలం ధనం శ్రమ వ్యర్థమయ్యే సూచనలు. పరామర్శలుంటాయి. సోమవారం పెద్దలతో సంప్రదింపులకు అవకాశం. ఆధ్యాత్మిక ప్రయాణాలు. సహకారం లభిస్తుంది. సోదర వర్గంతో అనుకూలత. మంగళవారం అనుకోని సమస్యలు. సంతానవర్గ వ్యవహారాల్లో జాగ్రత్త. అపోహలుంటాయి. బద్ధకం వల్ల సమస్యలు. బుధవారం కుటుంబంలో కొంత అనుకూలత. నష్టాలున్నా ఆర్థిక నిల్వల వల్ల అధిగమిస్తారు. కొత్త నిర్ణయాలు వద్దు. గురువారం ఉన్నత వ్యవహారాలుంటాయి. కీర్తి ప్రతిష్ఠలుంటాయి. పోటీ రంగంలో ఇబ్బందులు. వ్యతిరేకతలుంటాయి. శుక్రవారం సంప్రదింపులకు అనుకూలం. స్ర్తి వర్గ సహకారం. విహార యాత్రలపై దృష్టి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆదివారం సంప్రదింపుల్లో జాగ్రత్త వహించాలి. సహకార లోపాలు. ప్రయాణాదుల్లో సమస్యలు. అనుకోని సంఘటనలు. ఇబ్బందులను అధిగమించాలి. ఆధ్యాత్మిక వ్యవహారాల వల్ల మేలు. సోమవారం లాభాలు సంతోషాన్నిస్తాయి. నిర్ణయాదుల్లో అనుకూలత. పెద్దల ఆశీస్సులు. మంచి వార్తలుంటాయి. మంగళవారం నిర్ణయాదుల్లో జాగ్రత్త. ఒత్తిడులకు అవకాశం. పనులు వాయిదా పడుతుంటాయి. సౌకర్య లోపాలుంటాయి. బుధవారం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో అనుకూలత. సామాజిక గౌరవం పెంచుకునే సూచనలు. సంతోషం. గురువారం మనోభీష్టాలు నెరవేరుతాయి. కొంత నిరాశగా ఉంటుంది. కుటుంబ ఆర్థికాంశాల్లో ఇబ్బందులుంటాయి. శుక్రవారం అన్ని పనుల్లో ప్రయోజనాలుంటాయి. నూతన కార్యక్రమాలపై దృష్టి.

వృషభం (కృత్తిక 2,3,4 పా., రోహిణి, మృగశిర 1,2పా.)

ఆదివారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. దగ్గరి ప్రయాణాదులు ప్రభావితం చేస్తాయి. కొన్ని వార్తలు ఇబ్బంది పెట్టే అవకాశం. సంప్రదింపులుంటాయి. సోమవారం పోటీలు వత్తిడులున్నా సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కార్యనిర్వహణలో అనుకూలత. శ్రమాధిక్యం. గౌరవం. మంగళవారం లాభాలు కోల్పోయే అవకాశం. అనుకోని సమస్యలు. పనుల్లో ఆలస్యం లేదా వాయిదాలుంటాయి. బుధవారం అభీష్టసిద్ధి. సంతాన వర్గంతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలకు రూపకల్పన. ప్రణాళికా లాభాలు. గురువారం ఖర్చులు పెట్టుబడులు తప్పవు. ఆధ్యాత్మిక ప్రయాణాలు. దానధర్మాల వల్ల మేలు. అసంతృప్తి కూడదు. శుక్రవారం విశ్రాంతి లోపాలకు అవకాశం. పరామర్శలుంటాయి. రోగ నిరోధక శక్తి తగ్గే సూచనలున్నాయి. శనివారం నిర్ణయాదులకు అనుకూలం.

కన్య (ఉత్తర 2,3,4 పా., హస్త, చిత్త 1,2పా.)

ఆదివారం పోటీలు ఒత్తిడులున్నా విజయం సాధిస్తారు. గుర్తింపు లభిస్తుంది. లాభాలు అత్యధికంగా ఆశిస్తారు. ప్రయోజనాలు ఆశించినట్లు ఉండకపోవచ్చు. జాగ్రత్త. సోమవారం కుటుంబ ఆర్థికాంశాల్లో అనుకూలత. వ్యతిరేకతలపై విజయం. వ్యవహారాలను శ్రమతో నిర్వహిస్తారు. మంగళవారం సౌకర్య లోపాలుంటాయి. భాగస్వామ్యాల్లో అనుకూలత ఉన్నా ఆహార విహారాల్లో ఇబ్బందులుంటాయి. శ్రమాధిక్యం. బుధవారం నిర్ణయాదులు సంతృప్తినిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. నూతన పరిచయాలు. గురువారం సమస్యలుంటాయి. మానసిక వత్తిడులు. ఏవో కోల్పోయే అవకాశం. ఆత్మీయతలు తగ్గుతాయి. చికాకులు. శుక్రవారం ఇబ్బందిగా ఉన్నా కుటుంబ సహకారం లభిస్తుంది. మాట్లాడే ధోరణి ఆకట్టుకుంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.)

ఆదివారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. పరిచయాలు అనుబంధాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంలో జాగ్రత్తగా మెలగాలి. నిల్వధనం లోపాలు. సోమవారం వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడులు. అధికారిక వ్యవహారాల్లో గుర్తింపు. పదోన్నతులుంటాయి. శ్రమతో గౌరవం. మంగళవారం వ్యర్థమైన ఖర్చులు, ప్రయాణాలు. పరామర్శలకు అవకాశం. కొన్ని వార్తలు ఇబ్బంది పెట్టే సూచనలు. బుధవారం ఉన్నత విద్య, దూర ప్రయాణ భావనలు. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. కమ్యూనికేషన్స్‌కు అనుకూలం. గురువారం సౌకర్యాలు శ్రమకు గురి చేస్తాయి. ఆహార విహారాల్లో జాగ్రత్త వహించాలి. ఆశించిన సౌఖ్యం అందదు. శుక్రవారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. అధికారిక వ్యవహారాల్లో ఒత్తిడులున్నా గుర్తింపు. సౌకర్యవంతం. శనివారం అభీష్టాలు నెరవేరుతాయి.

మిథునం (మృగశిర 3,4పా. ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)

ఆదివారం ఉన్నత వ్యవహారాలపై దృష్టి. కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం. కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త. నిల్వధనం తగ్గే సూచనలు. మాటల్లో జాగ్రత్త అవసరం. సోమవారం సంతాన వర్గం వల్ల గౌరవం. గుర్తింపు. సృజనాత్మక వ్యవహారాలు. చక్కని ప్రణాళికలుంటాయి. మంగళవారం భాగస్వామ్యాల్లో ఒత్తిడులుంటాయి. సామాజిక గౌరవం తగ్గే సూచనలు. పరిచయాలు, అనుబంధాల్లో సమస్యలు. బుధవారం సౌకర్యాలు పెంచుకుంటారు. ఆహార విహారాలపై దృష్టి. వ్యాపార వ్యవహారాల్లో ఉన్నతి. గౌరవం. గురువారం లాభాలున్నా అనుకోని సమస్యలు ఎదురౌతాయి. ప్రయోజనాలు ఆశించినంతగా పొందలేక పోవచ్చు. శుక్రవారం అభీష్టాలు నెరవేరుతాయి. పిల్లలతో ఆనందంగా గడిపే సూచనలు. కొత్త పనుల రూపకల్పన. లాభాలుంటాయి.

తుల (చిత్త 3,4 పా., స్వాతి, విశాఖ 1,2,3 పా.)

ఆదివారం అభీష్టాలు నెరవేరుతాయి. సంతానవర్గ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి. వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. అనేక కార్యక్రమాల బాధ్యతలు. శ్రమాధిక్యం. సోమవారం నిర్ణయాదులకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలోచనలకు అవకాశం. మాటల్లో ఔన్నత్యం. సంతోషం. మంగళవారం సేవక వర్గ సహకారం కోసం ప్రయత్నం. సంప్రదింపుల్లో జాగ్రత్త. వార్తలు ఇబ్బంది పెట్టే సూచనలు. బుధవారం వ్యాపార వ్యవహారాల్లో ఖర్చులు పెట్టుబడులుంటాయి. విహార యాత్రలకు అవకాశం. పరామర్శలు. గురువారం భాగస్వామ్యాలు, పరిచయాలు పెరిగే సూచనలు. సౌకర్య లోపాలు. ఆహార విహారాల్లో జాగ్రత్త అవసరం. శుక్రవారం నిర్ణయాదుల్లో అనుకూలత. సంతోషంగా గడుపుతారు. అనుబంధాలు విస్తరిస్తాయి.

కుంభం (ధనిష్ఠ 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1, 2,3పా.)

ఆదివారం నిర్ణయాదులకు అనుకూలం. ఆత్మవిశ్వాసం పెంచుకునే ప్రయత్నం. వ్యతిరేక ప్రభావాలు తప్పవు. శ్రమతో అధిగమిస్తారు. పోటీలు వత్తిడులుంటాయి. సోమవారం లక్ష్యాలను సాధిస్తారు. గుర్తింపు, గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్ఠలు విస్తరిస్తాయి. ఉన్నత వ్యవహారాలపై దృష్టి. మంగళవారం లాభాలున్నా ఆశించిన సంతోషం లభించదు. కుటుంబ ఆర్థికాంశాల్లో జాగ్రత్తగా మెలగాలి. బుధవారం వ్యాపార వ్యవహారాల్లో అధిక ప్రయోజనాలు కోరుకుని నష్టపడే అవకాశం. నిల్వధనం కోల్పోకుండా చూసుకోవాలి. గురువారం సౌకర్య లోపాలుంటాయి. కాలం ధనం వ్యర్థమయ్యే సూచనలు. ఏదో పోగొట్టుకునే అవకాశం. జాగ్రత్త. శుక్రవారం ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాలకు అవకాశం. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సహకార లాభాలు.

కర్కాటకం (పునర్వసు 4పా., పుష్యమి, ఆశే్లష)

ఆదివారం అనుకోని సమస్యలు. అనారోగ్య భావనలు. నిర్ణయాల్లో లోపాలకు అవకాశం. అపోహలను తగ్గించుకోవాలి. తొందరపాటు కూడదు. ముఖ్య పనులు వాయిదా వేయాలి. సోమవారం సౌకర్యాలపై దృష్టి తగ్గించుకోవాలి. ఆహార విహారాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం. శ్రమాధిక్యం. మంగళవారం ఉన్నత వ్యవహారాల రూపకల్పన. వ్యతిరేక ప్రభావాలున్నా అధిగమిస్తారు. పోటీ రంగంలో జాగ్రత్త. బుధవారం సంప్రదింపులకు అనుకూలం. దూర ప్రయాణాలుంటాయి. వ్యాపార వ్యవహారాల్లో శుభ పరిణామాలు. గురువారం వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత. భాగస్వామ్యాల్లో సమస్యలకు అవకాశం. సామాజిక గౌరవం తగ్గవచ్చు. శుక్రవారం సౌకర్యాలు సమకూర్చుకుంటారు. పితృవర్గ వ్యవహారాల్లో అనుకూలత. ఆహార విహారాలపై దృష్టి.

వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆదివారం సౌకర్యాలు పెంచుకునే ప్రయత్నం. ఆహార విహారాలుంటాయి. దూర ప్రయాణ భావనలు. ఉన్నత విద్యలకు ప్రణాళికలు. అసంతృప్తి. గృహ వాహన వ్యవహారాలపై చర్చలు. సోమవారం ధార్మికమైన ఖర్చులు చేస్తే మంచిది. దానధర్మాలు, ఆధ్యాత్మిక ప్రయాణాల వల్ల మేలు. ఆహార విహారాలుంటాయి. మంగళవారం సంతానంపై కుటుంబ ప్రభావం ఉంటుంది. నిల్వధనం తగ్గిపోతుంది. మాటల వల్ల సమస్యలు. బుధవారం వ్యాపార వ్యవహారాల్లో ప్రయోజనాలుంటాయి. నూతన ప్రణాళికలు. క్రియేటివిటీ పెరుగుతుంది. గురువారం వ్యతిరేక ప్రభావాలు అధికం. పోటీ రంగంలో శ్రమతో విజయం. సంప్రదింపుల్లో ఇబ్బందులు. సహకార లోపాలు. శుక్రవారం ఖర్చులు పెట్టుబడులు అధికం. విందులు వినోదాలు విహారాలుంటాయి.

మీనం (పూర్వాభాద్ర 4 పా. ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదివారం ఖర్చులు పెట్టుబడులు అధికం. ఆలోచనల్లో ఒత్తిడులు. నిర్ణయాదులు శ్రమకు గురి చేస్తాయి. అపోహలు ఇబ్బంది పెట్టవచ్చు. సంతానవర్గం ప్రత్యేక దృష్టి. సోమవారం గౌరవ లోపాలకు అవకాశం. కాలం ధనం వ్యర్థం కాకుండా చూడాలి. ధార్మిక దానాలు, కార్యక్రమాల వల్ల మేలు. మంగళవారం వృత్తి ఉద్యోగాదులు ప్రభావితం చేస్తాయి. ఆత్మవిశ్వాసం తగ్గే సూచనలు. కార్యనిర్వహణలో సమస్యలు. బుధవారం పరిచయాలు, వ్యాపారానుబంధాలు విస్తరించే అవకాశం. నూతన కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ. గురువారం కుటుంబ ఆర్థికాంశాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఎక్కువ లాభాలు ఆశించకుండా కార్యనిర్వహణ చేయాలి. శుక్రవారం ఊహించని సమస్యలుంటాయి. నిల్వధనం కోల్పోవచ్చు. అనుకోని సంఘటనలుంటాయి. కొంత సంతోషం.

-డాక్టర్ సాగి కమలాకరశర్మ 97042 27744