S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలి

మడకశిర, సెప్టెంబర్ 22: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని అవినీతికి పాల్పడ్డారని స్వయంగా ఫ్రాన్స్ ప్రధాని స్పష్టం చేశారన్నారు.
రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో హెచ్‌ఎల్‌సీ సంస్థకు ఎంతో అనుభవం ఉందని, దీంతో ఆ సంస్థకు అప్పగిస్తే మంచి విమానాలు అందేవన్నారు. అయితే ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ సంస్థకు అప్పగించి ప్రధాని మోదీ రూ.41 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఫ్రాన్స్ ప్రధాని మాటలను రాష్టప్రతి రామనాథ్ కోవింద్ పరిగణనలోకి తీసుకుని పార్లమెంట్‌ను సమావేశపరచి విచారణకు పార్లమెంటరీ జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై అప్పట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రైతుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆందోళనలు చేశారని, దీన్ని ఆసరాగా చేసుకుని నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. బాబ్లీ ప్రాజెక్టు కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని రఘువీరా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.

చిత్రం..అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి