S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

గద్వాల, సెప్టెంబర్ 22: ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వ వైద్యులు చర్యలు తీసుకోవాలని, రోగులను ప్రైవేటు ఆసుపత్రికి పంపకుండా వైద్యం అందించేందుకు కృషి చేయాలని గద్వాల ఏరియా ఆసుపత్రి డాక్టర్లను జిల్లా కలెక్టర్ కె.శశాంక ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యసిబ్బంది బయోమెట్రిక్‌లోనే వేలిముద్రలు వేసి విధులకు హాజరవుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో వారికి అందుతున్న వైద్యం, వసతులపై చర్చించారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలు, మందుల వివరాలు, వైద్య పరికరాల పనితీరు తదితర సమస్యలపై ఆరా తీశారు. మరమ్మత్తులు నడుస్తున్న వార్డులను చూసి ఇలాంటి వార్డులో డాక్టర్లు ఎలా కూర్చుని పరీక్షలు నిర్వహిస్తున్నారని అడిగారు. ముఖ్యంగా ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ద్యం ఏమాత్రం బాగులేదని అసహనం వ్యక్తం చేస్తూయుద్ద ప్రాతిపాదికన బాగు చేయాలని హెచ్చరించారు. పారిశుద్ధ్య సిబ్బందిని ఉపయోగించి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ విజయ్‌కుమార్‌ను ఆదేశించారు. ఆసుపత్రి వౌళిక వసతులపై ఏవైనా నిధులు అవసరముంటే ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సమగ్ర నివేదిక తయారు చేసుకొని రావాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

మండలం ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యం
* మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ
* వివిధ పార్టీల నుండి కాంగ్రెస్‌లో చేరికలు
అచ్చంపేట, సెప్టెంబర్ 22: తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల ఏర్పాటు జాబితా నుండి సిద్దాపూర్‌ను తొలగించి అభివృద్ధిలో నిర్లక్ష్యం చేసిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆరోపించారు. శనివారం సిద్దాపూర్ గ్రామంలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగరవేశారు. అనంతరం సీనియర్ నాయకులు మల్లేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అచ్చంపేట మండల కేంద్రానికి రానుపోను 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సిద్దాపూర్‌ను రాజకీయ కారణాలతో మండలాన్ని ఏర్పాటు చేయడంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా పని చేసిన కాలంలో అనుభవరాహిత్యంతో కొన్ని పొరపాట్లు చేసి వుండవచ్చని ప్రస్తుతం అటువంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని అన్నారు. మరో మారు తాను ఎమ్మెల్యే గా ఎన్నికవ్వడానికి అవకాశం కల్పించాలని నాయకులను, కార్యకర్తలను ఆయన కోరారు. అనంతరం టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీల నుండి దాదాపు 140 మంది వంశీకృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండూవా కప్పుకున్నారు. అనంతరం మనె్నవారిపల్లి, ఘనపూర్, దేవులతాండా, మార్లపాడు,బండతాండ, బక్కలింగయ్యపల్లి, అక్కారం గ్రామాల జరిగిన కార్యమ్రాలలో కాంగ్రెస్‌లో 300 మంది కార్యకర్తలు చేరారు.

ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలి
* కలెక్టర్ శశాంక
గద్వాలరూరల్, సెప్టెంబర్ 22: అక్టోబరు 2 నాటికి జిల్లాను బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించడానికి జిల్లా ప్రజలందరూ మరుగుదొడ్లు నిర్మించుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ కె.శశాంక పిలుపునిచ్చారు. శనివారం మండల పరిధిలోని పూడూరు గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని, ఇందులో ప్రతిపౌరుడు, స్వచ్ఛంద సంస్థలు భాగ స్వాములు కావాలన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అనేక రోగాలనుండి దూరంగా ఉంటామని, ఆరోగ్యంగా ఉంటే తన ఆర్థికాభివృద్ది జరుగుతుందన్నారు. స్వచ్ఛ్భారత్ వల్ల పరిసరాల శుభ్రతతో పాటు కుటుంబ ఆదాయం కూడా వృద్ధి చెందుతుందన్నారు. అందువల్ల ప్రతి కుటుంబం తమ చెత్తను ఎక్కడబడితే అక్కడ పడవేయకుండా చెత్త బుట్ట్టలలోనే వేసే గుణాన్ని అలవర్చుకోవాలన్నారు.