S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంపీ జేసీ వ్యాఖ్యలు సరికాదు

పిఠాపురం, సెప్టెంబర్ 22: ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన వాఖ్యలు సరికాదని, పోలీసులు సమర్థవంతంగానే పనిచేస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో రూ.90 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక భవనాన్ని ఫైర్ డీజీ సత్యనారాయణ, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మతో కలిసి శనివారం ఆయన ప్రారంభించి అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. జేసీ దివాకర్‌రెడ్డి పోలీసులపై చేసిన వాఖ్యలు సరికాదని, వివాదాన్ని ఇక్కడితో వదిలేయాలని సూచించిన రాజప్ప, జేసీ మీ పార్టీయే కదా, మీరు కంట్రోలు చేయొచ్చు కదా అని విలేఖర్లు ప్రశ్నించగా ఆయన మా పార్టీయే కానీ ఆయన వ్యక్తిత్వం వేరు, అదంతా మీకు తెలిసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేద్దు అంటూ మాట దాటవేశారు. అనంతపురం జిల్లాలో ప్రబోధానందస్వామి భక్తులకు, జేసీ వర్గీయులు పరస్పర దాడుల్లో భాగంగా పోలీసులు తమను పట్టించుకోలేదని, తనను వదిలేసి పోలీసులు పారిపోయారని, పలు మాటాలతో జేసీ పోలీసుల తీరును విమర్శించిన నేపథ్యంలో పోలీసులు ఘాటుగా స్పందించి జేసీ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన హోంమంత్రి రాజప్ప వివాదం పెరగకుండా చూస్తున్నామని, అక్కడ విచారణ జరుగుతుందని, ఉన్నత పోలీసు అధికారులు దృష్టిసారించారని వివరించారు. ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం అటు పోలీసులకు, ఇటు నాయకులకు మంచిది కాదన్న హోంమంత్రి వివాదం త్వరలోనే సమసిపోతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
చంద్రబాబును ఇరుకున పెట్టాలన్నదే ధ్యేయం
చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ముందుకు దూసుకుపోతుందన్న హోంమంత్రి రాజప్ప 2019లో టీడీపీ మరోసారి అధికారం చేపట్టబోతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని, ఎప్పుడో బాబ్లీ కేసును ఇప్పుడు తిరగతోడి నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేయడం వెనుక కేంద్రం ఒత్తిడి మహారాష్ట్ర పోలీసులపై ఉందన్నారు. చట్టాన్ని తాము గౌరవిస్తామని అందుకే చంద్రబాబు తరఫున న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారన్నారు. జగన్‌తో కలిసి బీజేపీ చంద్రబాబును అణగదొక్కాలని చూడటం దారుణమన్నారు. జగన్‌కు ప్రజాదరణ రోజురోజుకీ తగ్గుతోందని మంత్రి రాజప్ప పేర్కొన్నారు.
చిత్రం.. పిఠాపురంలో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న హోంమంత్రి చినరాజప్ప