S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న ఎన్డీఏ

గుంటూరు, సెప్టెంబర్ 22: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తోందని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యాన శనివారం గుంటూరు నగరంలో భారత రాజ్యాంగ పరిరక్షణ మహార్యాలీ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో గత నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు అధికమయ్యాయన్నారు. వారు ఏమి తినాలో కూడా చెప్పే దుస్థితి దేశంలో నెలకొనడం దారుణమన్నారు. రాష్టప్రతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు ఉండే ఢిల్లీ నగరంలో రాజ్యాంగ ప్రతులను దగ్ధం చేసిన వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం ప్రయత్నించగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో 12 మంది చనిపోవడం బాధాకరమన్నారు. ఆందోళన ఫలితంగా కేంద్రం మరలా చట్టాన్ని యథాతథంగా అమలు చేసేందుకు ఆర్డినెన్స్ జారీచేసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో పొందుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ దేశంలో ప్రతి దేశంలో ఐదు నిమిషాలకు దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని, వారు ఈ దేశ పౌరులు కాదా అని ప్రశ్నించారు. దళితులపై దాడులు జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని దళితుడు రాసినందుకే బీజేపీ మంత్రులు, నాయకులు అగౌరవపరుస్తున్నారా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఏ ఒక్కరికోసమో రచించలేదని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ రచించారన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, నటుడు శివాజీ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.