S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

అణువిద్యుత్ ప్లాంటు వద్దు

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 22: రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న అణు విద్యుత్ ప్లాంట్ ఆలోచనను ఉపసంహరించుకోవాలని, దివ్యాంగులకు ఐదు వేల రూపాయల పెన్షన్ అమలు చేయడంతో పాటు అర్హత ఉన్న వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి శనివారం రాసిన లేఖలో వివిధ సమస్యలను మధు ప్రస్తావించారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో తలపెట్టిన వినాశకర న్యూక్లియర్ పవర్ ప్లాంట్, కావలిలో మరో న్యూక్లియర్ పవర్‌ప్లాంట్ పెట్టాలనే ఆలోచనను విరమించుకోవాలని మధు సూచించారు. ఇప్పటికే కొవ్వాడలో సేకరించిన భూములను కూడా రైతులకు తిరిగి అప్పగించాలన్నారు. రాష్ట్ర జనాభాలో 4శాతం ఉన్న దివ్యాంగులకు ఐదువేల రూపాయల పెన్షన్ అందించాలని విజ్ఞప్తి చేశారు. వారికి అంత్యోదయ కార్డులు, ఆహర భద్రతా కార్డులను మంజూరు చేయాలన్నారు. వివిధ శాఖలో ఉన్న దివ్యాంగుల పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. స్వయం ఉపాధికోసం వడ్డీ లేని రుణంతో పాటు వీరికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో గ్రామ పాలనలో కీలకమైన వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వీరిలో అనేక మందికి అర్హతలు ఉన్నప్పటికి ఎటువంటి పదోన్నతులకు నోచుకోవడం లేదన్నారు. వీఆర్‌వోలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించే విషయంలోనూ వివక్ష పాటిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.