S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పీఏటీతో ఏపీకి రూ. 150కోట్లు ఆదా

అమరావతి, సెప్టెంబర్ 23: ఇంధన పొదుపు లక్ష్యసాధనలో భాగంగా నిర్వహణ, సాధన, వ్యాపారం (పీఏటీ) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రాష్ట్రాలకు సూచించింది. ఇంధన పొదుపుతో పాటు గణనీయమైన ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణకు పీఏటీ అమలు తప్పనిసరని స్పష్టం చేసింది. ఇందులో అన్ని రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషించాలని కోరింది. తొలివిడత పీఏటీ విజయవంతంగా అమలులోకి వచ్చిన నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో బీఈఈ జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నారు. నేషనల్ మిషన్ ఆఫ్ ఎన్‌హాన్స్డ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (ఎన్‌ఎంఈఈఈ) కింద బీఈఈ గుర్తింపు పొందిన వినియోగదారుల (డీసీలు)కు పీఏటీ తప్పనిసరని నిర్ణయించారు. ఇది మార్కెట్ ఆధారిత వ్యవస్థ. విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే పరిశ్రమలకు దీన్ని వర్తింపజేస్తారు. ఆయా పరిశ్రమలు ఇంధన పొదుపు లక్ష్యాలను చేరుకోలేకపోతే బీఈఈ జరిమానా విధిస్తుంది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతీయ సదస్సుకు హాజరుకావాల్సిందిగా బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌కు సమాచారం అందింది. నిరంతర విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాల తగ్గింపు, ఇంధన పొదుపులో ఏపీ సాధించిన విజయాలు, చేపడుతున్న కార్యక్రమాలు సదస్సులో వివరించాలని అభయ్ భాక్రే కోరారు. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. పీఏటీని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అజయ్ భాక్రే స్పష్టం చేశారు. ఈ పథకం అత్యంత విజయవంతమైందని, పీఏటీ వల్ల 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (టీవోఈ) ఇంధన వనరులు ఆదా అయ్యాయని, వాస్తవ లక్ష్యం 6.68 టీవోఈనే అని తెలిపారు. ఫలితంగా దాదాపు రూ. 9500 కోట్లు ఆదా కావటమే కాకుండా 2017 వరకు 31 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించగలిగామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) ఆధ్వర్యంలో పీఏటీ అమలు ద్వారా సుమారు రూ. 150కోట్లు ఆదా జరిగినట్లు తెలిపారు. పీఏటీ తొలివిడతలో భాగంగా దేశం మొత్తంగా 846 డీసీలు ఉన్నాయని, ఇందులో ఏపీలోనే 24 ఉన్నట్లు అభయ్ భాక్రే చెప్పారు. పీఏటీ-2లో భాగంగా ఏపీలో 14 డీసీలు ఉంటాయన్నారు. పీఏటీ-3లో మూడు డిస్కంలతో పాటు రైల్వే, పెట్రోలియం రంగాలు ఉంటాయని వివరించారు. పీఏటీలో కీలకమైన అల్యూమినియం, సిమెం ట్, ఉక్కు, పేపర్, ఎరువులు, జౌళి, థర్మల్ పవర్ ప్లాంట్లు ఉంటాయన్నారు. పీఏటీ-4 పరిధిలోకి హోటళ్లు కూడా వస్తాయన్నారు. ఇంధన పొదుపులో లక్ష్యాలను సాధించిన డీసీలకు బీఈఈ సర్ట్ఫికెట్లు మంజూరు చేస్తుందని సంస్థ కార్యదర్శి పంకజ్ కుమార్ వెల్లడించారు. ఏపీలో పీఏటీ పథకం పురోగతిని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఇటీవలే కేంద్రానికి నివేదించారు. రాష్ట్రంలోని డీసీల పనితీరును మదింపు చేసేందుకు ఏపీ ఎస్‌ఈఎం ఇప్పటికే గుర్తింపు పొందిన ఆడిటర్లను నియమించిందని తెలిపారు. బీఈఈ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించేందుకు ఏపీ ఈఆర్‌సీ నుంచి ఓ అధికారిని కూడా నియమించినట్లు చెప్పారు. ఇంధన పొదుపు చర్యలను సమర్థవంతంగా అమలు చేయటంతో పాటు ఉత్తమ విధానాలను అనుసరించటంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారించారని, జాతీయ సదస్సు సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని మరింత ఉత్తమ విధానాలు అవలంబించాలనే యోచనతో ప్రభుత్వం ఉందని వివరించారు.