S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కులధ్రువీకరణ ఇక్కట్లపైనే కిడారి చివరి ప్రసంగం!

విజయవాడ, సెప్టెంబర్ 23: ఇటీవల జరిగిన శాసనసభ వర్షాకాల ఏడు రోజుల సమావేశాల్లో ఎంతో హుషారుగా శాసనసభ్యల చుట్టూ తిరుగుతూ కనిపించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు దారుణ హత్యకు గురికావటాన్ని తోటి సభ్యులు, శాసనసభ కార్యాలయ సిబ్బంది నమ్మలేకపోతున్నారు. చీఫ్ విప్, విప్‌లు ఉన్నప్పటికీ విప్ హోదాలో కిడారి సమావేశం జరుగుతున్నంత సేపు కూడా ప్రతి ఎమ్మెల్యే సీటు వద్దకెళ్లి సభలో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుతుండేవారు. ఎప్పుడూ నవ్వుతూ కన్పించే కిడారి శాసనసభ సమావేశాల్లో చివరిరోజు ప్రశ్నోత్తరాల్లో చివరి ప్రశ్నతో ఒక్కసారిగా ఉద్వేగానికి గురై మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నామే గాని కొన్ని కులాల వారికి కుల ధృవీకరణ పత్రాలను ఇవ్వలేని స్థితిలో ఉన్నామని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. బెంతో ఒరియా, కొండ కుమ్మరులు, బేడబడజంగాలు ఎస్సీలా, ఎస్టీలా, ఓసీలా అన్నది తేల్చలేకపోవటం ఏమిటంటూ ప్రశ్నించారు. దీనివల్ల రిజర్వేషన్ ఫలాలు అందుకోలేకపోతున్నారని, ఇదేమి ప్రజాస్వామ్యం, ఇదేమి పాలన? అంటూ కిడారి ఒకింత ఆవేదనతో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.