S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హామీలను విస్మరించిన కేసీఆర్

రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శ
* పలు పార్టీల నేతలు బీజేపీలో చేరిక *
మెట్రో రెండో దశ ప్రారంభానికి తొందరెందుకన్న దత్తాత్రేయ

************************
హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో అభివృద్ధి కోసం అధికార మార్పురావాలని, ఆ మార్పుకోసం ఈసారి బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్‌ను తీర్చిదిద్దే ఎన్నికలు ఒక కుటుంబ భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలు కావని అన్నారు. టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌కు ఓటేస్తే పెనం మీద నుండి పొయ్యలో పడినట్టేనని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌లో తెలంగాణ భాగస్వామ్యం కాకపోవడం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆయన చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నేతలు బీజేపీలో చేరిన సందర్భంగా పార్టీ రాష్టక్రార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ది మహాకూటమి కాదని, అదో విష కూటమి అని అన్నారు. అది విచిత్ర కూటమి అని, విఫల కూటమి అని వ్యాఖ్యానించారు. 60 రోజులు కష్టపడితే అధికారం మనదే అంటూ ఉత్తమ్ కుమార్‌రెడ్డి పగటి కలలు కంటున్నారని, 21 సీట్లతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే ఆ పాత్ర పోషించడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని అన్నారు. వాస్తవానికి టీఆర్‌ఎస్‌ను ఓడించడానికి కావల్సిన బలం కానీ, అజెండా కానీ ప్రజా మద్దతు, నాయకత్వం కాంగ్రెస్ దగ్గర లేవని అన్నారు. కోదండరాం అజెండాను కాంగ్రెస్ ఎట్టిపరిస్థితుల్లో అమలుచేయదని చెప్పారు. చంద్రబాబు ఇంటరెస్టు ఆంధ్రప్రదేశ్ తప్ప, తెలంగాణ కాదని అన్నారు. హరీష్‌రావు వ్యాఖ్యలు ఉద్వేగంతో కూడుకున్నవేనని , భవిష్యత్‌లో టీఆర్‌ఎస్ ముక్కలుగా నిలువునా చీలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ అజెండాను అమలుచేయలేదనే అంశం ప్రజల్లోకి చొచ్చుకుపోయిందని, అంతేగాక, తమ కుటుంబ భవిష్యత్ తప్పితే, ప్రజల భవిష్యత్ కోసం పనిచేసే పార్టీ కాదని తేలిపోయిందని అన్నారు. టీఆర్‌ఎస్‌ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరని అన్నారు. కేటీఆర్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడితే బావుంటుందని, బీజేపీని విమర్శించి అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారని అన్నారు. అవాస్తవాలు చెప్పింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు.
ఇంత తొందరెందుకు? దత్తాత్రేయ
హైదరాబాద్ మెట్రో కారిడార్ రెండో దశను ప్రారంభించడానికి ఇంత తొందరెందుకు అని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్ధిక సాయంతో ఈ ప్రాజెక్టును ఎన్నికల హడావుడితోనే ప్రారంభించినట్టు కనిపిస్తోందని అన్నారు.
కనీసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కూడా ఆహ్వానించలేదని అన్నారు. ఈ ప్రాజెక్టుపై కేంద్రం 1450 కోట్లు వెచ్చించిందని, అందులో 1200 కోట్లు విడుదల చేసిందని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని పాటిస్తూ ప్రధాని ఫోటో కూడా ప్రచురణల్లో వేయలేదని, రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో నియంతృత్వ పాలన సాగిస్తోందని అన్నారు. మెట్రో రైళ్లలో ధరలు చుక్కల్ని తాకుతున్నాయని ఆయన ఆరోపించారు. పాతనగరంలో మెట్రో పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన సూచించారు.