S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఐలవ్ ఇండియా

న్యూయార్క్, సెప్టెంబర్ 24: ‘ భారత్ అంటే నాకెంతోప్రేమ. నా మిత్రుడు నరేంద్ర మోదీకి నా అభినందనలు తెలపండి’అంటూ భారత్ విదేశాగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వీరిద్దరి మధ్య కొద్దిసేపుమాటలు సాగాయి. మాదక ద్రవాల నిరోధనపై మాట్లాడిన ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించుకుని వేదిక నుంచి వెళ్లిపోయారు. అయితే ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీహేలి మాత్రం సుష్మా వద్దకు వచ్చి ఆమెను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వెళ్లిపోతున్న ట్రంప్‌కు సుష్మాను పరిచయం చేశారు. భారత్ ప్రధాని మోదీ నుంచి అభినందన సందేశం తీసుకొచ్చానని ఈ సందర్భంగా ట్రంప్‌కు సుష్మా స్పష్టం చేశారు. ఆ సందర్భంలో ట్రంప్‌‘నేను భారత్‌ను ప్రేమిస్తాను. నా స్నేహితుడు మోదీకి కూడా అభినందనలు చెప్పండి’అని అన్నారు.
సుష్మా బిజీబిజీ
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 73వ వార్షిక సమావేశాలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఊపిరి సలపనంత బిజీగా కార్యక్రమాలున్నాయి. సార్క్, బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల్లో పాల్గొంటారు. ఐరాస సమావేశాల నిమిత్తం శనివారమే ఇక్కడకు చేరుకున్న విదేశాంగ మంత్రి వివిధ దేశాల విదేశాంగ మంత్రులతో 30 ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో సుష్మా స్వరాజ్ పాల్గొన్నారు. ప్రపంచానికే పెను సవాల్‌గా మారిన డ్రగ్ మాఫియాను అణచివేయడానికి ఓ పకడ్బంధీ కార్యాచరణ సమావేశాల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ కీలక సమావేశానికి 120 సభ్యదేశాలు హాజరువుతున్నాయి. ద్వైపాక్షిక సమావేశాలకు హాజరుకావల్సిందింగా సుష్మాస్వరాజ్‌కు 30 దేశాల నుంచి ఆహ్వానాలు అందాయి. ఐరాసలో భారత రాజకీయ సంయుక్తకార్యదర్శి దినేష్ పట్నాయక్ సోమవారం ఈ వివరాలు మీడియాకు తెలిపారు. నెల్సన్ మండేలా శాంతి సమావేశానికి స్వరాజ్ హాజరవుతారు. ప్రపంచ శాంతికి మండేలా చేసిన కృషిని గుర్తుచేస్తూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సైరిల్ రమాఫోసా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వారం రోజులు పర్యటనలో అనేక కార్యక్రమాలతో సుష్మా బిజీబిజీగానే గడుపుతారు. వాతావరణ మార్పు, అలీన దేశాల మంత్రుల సమావేశంలో ఆమె ప్రసంగిస్తారు. జీ-4, ఐబీఎస్‌ఏ(ఇండియా,బ్రెజిల్,సౌతాఫ్రికా), బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా), సార్క్(సౌత్ ఆసియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కో-ఆపరేషన్) సమావేశాలకు ఆమె హాజరవుతారు. అలాగే పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీతో 27న జరిగే భేటీకి సుష్మా స్వరాజ్ హాజరవుతారు. అలాగే జీ-77,ఎల్‌డీసీ సమావేశాలకు భారత్ రాయబారులు హాజరువుతారు. ఐరాస సర్వసభ్య సమావేశాల నేపథ్యంలో కామనె్వల్త్, హార్ట్ ఆఫ్ ఆసియా సమావేశాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమావేశాల్లో పాల్గొంటారు. క్షయ, అంటురోగాల నిరోధంపై జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో నడ్డా పాల్గొంటారు. ఊపిరితిత్తుల వ్యాధులు, వివిధ రకాలైన కేన్సర్లు, డయాబెటిక్స్, హృద్రోగం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు ముఖ్యంగా యువత వాటి బారిన పడకుండా తీసుకునే చర్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఈ సందర్భంగానే ఏర్పాటు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రెయేసిస్ ఆధ్యర్వంలో వీటిపై చర్చిస్తారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పలువురు ఎన్నారై ప్రముఖులతోనూ భేటీ అవుతారు.