S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పేదల సొత్తు అనిల్ జేబులోకి..!

అమేథీ, సెప్టెంబర్ 24:రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. దేశానికి కాపలాదారుడ్నని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ పేదల నుంచి సొమ్మును లాక్కుని పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి అప్పగించారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి సమాధానం చెప్పాలంటూ మోదీకి అనేక ప్రశ్నలను సంధించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండ్ తనపై చేసినట్టుగా వచ్చిన అభ్యంతరకర వ్యాఖ్యలపైనా వివరణ ఇవ్వాలని కోరారు. ‘పేదలు, జవాన్లు, దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల నుంచి దాదాపు 20వేల కోట్ల రూపాయలను లాక్కుని ఆ మొత్తాన్ని అనీల్ అంబానీ చేబులో పెట్టారు’అంటూ ఆమేథీ లోక్‌సభ నియోజక వర్గంలో సోమవారం జరిగిన బహిరంగ సభలో రాహుల్ అన్నారు. అసలు ఎంత మొత్తానికి రాఫెల్ డీల్ కుదుర్చుకున్నారో కూడా దేశ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మోదీపై ఉందన్నారు. రాఫెల్‌పై పార్లమెంట్‌లో చర్చ జరిగినప్పుడు ప్రధాని మోదీ తన కళ్లలోకి చూడలేకపోయారని రాహుల్ గుర్తు చేశారు. మోదీ ప్రసంగాలు చేస్తారే తప్ప ఎలాంటి ప్రశ్నలకు జవాబుచెప్పరంటూ వ్యంగ్యోక్తి విసిరారు. అందుకు కారణం జవాబు చెప్పే దైర్యం ఆయనకు లేకపోవడమేనని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. ఓ పక్క రైతులు, పేదలు సమస్యల కూపంలో చిక్కుకుని ఆర్తనాదాలు చేస్తూంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఐదు పది మందికి మాత్రమే లబ్ధి చేకూరుస్తోందని రాహుల్ విరుచుకు పడ్డారు. విజయ్‌మాల్యా, లలిత్ మోదీ,అనీల్ అంబానీలకే మోదీ వల్ల ప్రయోజనం చేకూరిందని అన్నారు. రాఫెల్ డీల్‌పై కాకుండా వేలాది కోట్ల రూపాయలను మరోరకంగా వెచ్చించి ఉంటే యువతకు ఉపాధి అవకాశాలు లభించి ఉండేవని,దేశానికీ అన్ని విధాలుగా ప్రయోజనం కలిగి ఉండేదని చెప్పారు. కానీ ఇంత భారీ మొత్తాన్ని ఓ పారిశ్రామికవేత్త చేతిలో పెట్టారని రాహుల్ అన్నారు.గత ఏడు దశాబ్దాలుగా విమానాల తయారీలో దేశానికి ఎంతగానో సేవలందిస్తున్న హెచ్‌ఏఎల్ సంస్థను పక్కన పెట్టి రాఫెల్ కాంట్రాక్టును అనీల్ అంబానీ సంస్థకు అప్పగించడం దారుణమన్నారు. తన జీవితంలో ఎప్పుడూ అనీల్ అంబానీ విమానం తయారు చేయలేదని, పైగా ఆయన బ్యాంకులకు 45వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాల్సి ఉందని కూడా రాహుల్ అన్నారు. రాఫెల్ కాంట్రాక్టును పొందడానికి పది రోజుల ముందే అనీల్ అంబానీ సంస్థ అవతరించిందని గుర్తు చేసిన రాహుల్ ‘ఇంత ముందుగానే ఆయనకు రాఫెల్ డీల్ గురించి ఎలా తెలిసిందని’ ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల ధరల్ని మూడు నెలల్లో ప్రకటిస్తామని చెప్పిన దేశ రక్షణ మంత్రి ఇప్పుడేమే ‘ఇది దేశ రహస్యాలకు సంబంధించింది..ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించలేమ’ని అంటున్నారంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు.

చిత్రం..తన పార్లమెంట్ నియోజకవర్గమైన అమేథీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్‌గాంధీ సోమవారం విద్యార్ధులతో ముచ్చటిస్తున్న దృశ్యం.