S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మొదలైన పరీక్షల హడావుడి

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో టెన్త్ , ఇంటర్‌పరీక్షల హడావుడి మొదలైంది. టెన్త్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు, ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూలు జారీ అయ్యాయి. మరో పక్క దాదాపు అన్ని కాలేజీల్లో సిలబస్‌ను కూడా పూర్తి చేసి, దసరా సెలవుల అనంతరం రివిజన్ ప్రారంభించనున్నారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరిలో రెండు స్పెషాలిటీ సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరిలో సెకండియర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా 24వ తేదీతో ముగిసింది. 25వ తేదీ నుండి నవంబర్ 8 వరకూ 100 రూపాయిల జరిమానాతో చెల్లించాలి. నవంబర్ 9 నుండి 26 వరకూ 500 రూపాయిల జరిమానాతో, నవంబర్ 27 నుండి డిసెంబర్ 11 వరకూ 1000 రూపాయిల జరిమానాతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. డిసెంబర్ 12 నుండి జనవరి 2వ తేదీ వరకూ 2వేల రూపాయిల జరిమానా, జనవరి 3 నుండి 21వ తేదీ వరకూ 3వేల రూపాయిల జరిమానా, జనవరి 22 నుండి ఫిబ్రవరి 4 వరకూ 5వేల రూపాయిల జరిమానాతో పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. జనరల్, ఒకేషనల్ స్ట్రీం పరీక్షలకు 460 రూపాయిలు, ప్రాక్టికల్స్‌తో కలిపి 620 రూపాయిలు చెల్లించాలి.
ప్రాక్టికల్స్ కోసం మాత్రమే అయితే 170 రూపాయిలు, బ్రిడ్జికోర్సు థియిరీ పరీక్షకులకు అయితే 120 రూపాయిలు, మాథ్స్, సెకండ్ లాంగ్వేజి అదనపు సబ్జెక్టులకు 460 రూపాయిలు, హ్యుమనిటీస్‌లో ఇంప్రూవ్‌మెంట్‌కు వెళ్తే 1050 రూపాయిలు, సైన్స్ గ్రూప్‌లో ఇంప్రూవ్‌మెంట్ రాసేవారు 1200 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
ఎస్సెస్సీ పరీక్ష ఫీజు షెడ్యూలు
ఎస్సెస్సీ పరీక్షలకు ఎలాంటి జరిమానా లేకుండా అక్టోబర్ 29 వరకూ చెల్లించవచ్చు. 50 రూపాయిల జరిమానాతో నవంబర్ 12 వరకూ, 200 రూపాయిల జరిమానాతో నవంబర్ 26 వరకూ, 500 రూపాయిల జరిమానాతో డిసెంబర్ 10 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. తదనుగుణంగా హెడ్మాస్టర్లకు, డిఇఓలకు, డైరెక్టరేట్‌కు షెడ్యూలు రూపొందించారు. మూడు సబ్జెక్టుల వరకూ 110 రూపాయిలు, మూడు సబ్జెక్టులకు మించి అయితే 125 రూపాయిలు, వొకేషనల్ విద్యార్థులు రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా మరో 60 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటా 24వేల కంటే తక్కువ ఆదాయం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఫీజు మినహాయింపు ఇచ్చినట్టు అధికారులు చెప్పారు.