S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నవయుగ వైతాళికుడు, ప్రజాకవి గురజాడ

1.బాల్య వివాహాల వలన బలి అవుతున్న కన్యల జీవితాలను వివరించే ఈ గేయం, ఇతివృత్తం గురజాడ అప్పారావుగారు రచించిన ఏ రచనలోనిది?
కాసుకు లోనై తల్లీ తండ్రి
నెనరూ న్యాయం విడనాడి
పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
ముదుసటి మొగుడుకు ముడివేస్రీ.
ఎ.పూర్ణమ్మ బి.మెటిల్డా
సి.సంస్కర్త హృదయం డి.కన్యాశుల్కం

2.ఈసురోమని మనుషులుంటే, దేశం బాగుపడదని, అన్నదమ్ముల వలె జాతులు, మతములన్నీ మెలగవలెనని గళమెత్తిన గురజాడ వ్రాసిన కన్యాశుల్కం ఎన్నో భారతీయ భాషలందు అనువదించారు. ఏ అంతర్జాతీయ భాషలో కూడా అనువదించారు?
ఎ.ఫ్రెంచ్ బి.ఇంగ్లీష్
సి.రష్యన్ డి.పైవన్నియు

3.దేశభక్తి, ఐకమత్యము పెంపొందించే ఈ దేశభక్తి గేయం గురజాడ అప్పారావు గారు ఏ సంవత్సరంలో రచించెను?
చెట్టపట్టాల్ పట్టుకొని/ దేశస్థులంతా నడువవలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు/ మతములన్నియు మెలగవలెనోయ్
ఎ.1921 బి.1910
సి.1929 డి.1902

4.వితంతు వివాహాలు, బాల్య వివాహాలు, మహిళలకు విద్యా హక్కు కోసం ప్రాకులాడి పాటుపడిన అప్పారావుగారు ఏ రచన ద్వారా మహిళాభ్యుదయం కొరకు సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు?
ఎ.లంగరెత్తుము బి.దిద్దుబాటు
సి.లవణరాజు కల డి.కొండుభట్టీయం

5.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయనగరంలోని గురజాడ వారు నివసించిన గృహాన్ని ఏ చట్టం క్రింద రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంది?
ఎ.ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ ఆక్ట్, 1958
బి.హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఆక్ట్ 1951
సి.హిస్టారికల్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్, 1960
డి.యునెస్కో కల్చరల్ హెరిటేజ్ లా

6.గురజాడ అప్పారావు గారు అనారోగ్యం వలన 1915లో పరమపదించారు. ఆయనకు ఏ విశ్వవిద్యాలయం ఫెలోషిప్ ఇచ్చి గౌరవించింది?
ఎ.ఆంధ్ర విశ్వవిద్యాలయం 1911లో
బి.మద్రాస్ విశ్వవిద్యాలయం 1913లో
సి.బొంబాయి విశ్వవిద్యాలయం 1913లో
డి.కలకత్తా విశ్వవిద్యాలయం 1910లో

7.తెలుగు భాష మరియు సాహిత్యాభివృద్ధి కోసం కృషి చేసి ప్రజాస్వామ్య సిద్ధాంతాలను వ్యాప్తి చేస్తూ సమాజాన్ని రూపుదిద్దడానికి ఎన్నో రచనలు చేసిన గురజాడ అప్పారావు గారు ఏ ఉద్యోగం చేసేవారు?
ఎ.కలెక్టర్ ఆఫీసులో గుమాస్తా
బి.విజయనగరం మహారాజా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్
సి.విజయనగరం మహారాణిగారికి వ్యక్తిగత కార్యదర్శి, విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకుడు
డి.పైవన్నియు

8.సాంఘిక సంస్కర్త మరియు గొప్ప మానవతావాది అయిన గురజాడ అప్పారావు రాసిన ఆంగ్ల పద్యం ఏది?
ఎ.ది కుక్, సారంగధర, చంద్రహాస బి.ఇండియన్ లీషర్ అవర్
సి.రీస్ అండ్ రోయిట్ డి.పైవన్నియు

9.అభ్యుదయ కవితా పితామహుడు సెప్టెంబర్ 21, 1861న ఎలమంచిలి వద్ద రాయవరం గ్రామంలో జన్మించారు. కన్యాశుల్కము మొదటి ప్రదర్శన 1882లో ఎక్కడ ఇచ్చారు?
ఎ.జగన్నాథ విలాసిని సభ, విజయనగరం
బి.అయ్యంగార్ నాటక కళాసమితి, మద్రాసు
సి.ఫ్రెండ్స్ క్లబ్, బళ్లారి
డి.సింహాచలం కళాక్షేత్రం, విశాఖపట్నం

10.‘విక్టోరియా ప్రశస్తి’ అనే పద్య కావ్యం ఆంగ్లంలో రాసి గురజాడ అప్పారావు గారు ఏ రాణిని ప్రశంసల వర్షం కురిపించేరు?
ఎ.ప్రుస్సియా మహారాణి విక్టోరియా
బి.రీవా మహారాణి
సి.జర్మనీ మహారాణి విక్టోరియా
డి.బ్రిటిష్ మహారాణి విక్టోరియా
*
గత వారం క్విజ్ సమాధానాలు
1.డి 2.డి 3.డి 4.డి 5.డి 6.డి 7.డి 8.డి 9.డి 10.సి

-సునీల్ ధవళ 97417 47700