S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మేనిపై మెరుపులు..!

మోచేతులపై ఇష్టదైవం బొమ్మలనో, ఆప్తుల పేర్లనో ‘పచ్చబొట్టు’ వేయించుకోవడం పాత పద్ధతి. విభిన్న రంగుల్లో వివిధ ఆకారాలను ‘టాటూ’లుగా వేయించుకోవడం నేటి నవ నాగరిక సమాజంలో వేలం వెర్రిగా మారింది. నగరాల్లో అయితే ‘టాటూ స్టూడియో’లు వెలుస్తున్నాయి. సుశిక్షుతులైన నిపుణులు ఈ స్టూడియోల్లో ‘టాటూ’లు వేస్తూ దండిగానే ఆదాయం సంపాదిస్తున్నారు. చేతులు, కాళ్లపైనే కాదు.. ముఖంపైన, హృదయ భాగంపైన, వీపుపైన, మెడపైన.. ఇలా తమకు నచ్చిన చోట ‘టాటూ’లు వేయించుకుంటూ యువతీ యువకులు తమ ముచ్చట తీర్చుకుంటున్నారు. ‘టాటూ’ సంస్కృతి విశ్వవ్యాప్తం కావడంతో ఈ ‘కళ’ నానాటికీ కొత్తపుంతలు తొక్కుతోంది. సినీనటుల ముఖాలు, ఇష్టదైవాలు, ప్రకృతి దృశ్యాలు, పురాతన కట్టడాలు.. ఇవన్నీ శరీరంపై ‘టాటూ’ల రూపంలో చేరిపోతున్నాయి. ఆధునిక చిత్రకళకు అద్దం పట్టేలా యువతీ యువకులు తమ శరీరంపై ‘టాటూ’లను మెరిపిస్తున్నారు. ‘టాటూ’ కళలో మెళకువలు నేర్పే శిక్షణ సంస్థలు కూడా వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ‘టాటూ’ కళాకారులు తీర్చిదిద్దిన బొమ్మలతో లండన్‌లో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. వివిధ దేశాలకు చెందిన కళాకారులు రూపొందించిన ‘టాటూ’లు ఈ పుస్తకంలో కొలువుదీరాయి. జర్నలిస్టు నికొలాస్ షోన్‌బెర్గర్ పర్యవేక్షణలో రూపొందిన ఈ పుస్తకం తొలి ముద్రణలోనే వేలాది ప్రతులు అమ్ముడుపోయాయట! వివిధ దేశాల్లోని మూడు వందల ‘టాటూ’ స్టూడియోల నుంచి సేకరించిన అద్భుత కళారూపాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. జపాన్, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు పలు ఆసియా దేశాలకు సంబంధించిన ‘టాటూ’ కళాకారులు వేసిన బొమ్మలు ఈ పుస్తకంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సమకాలీన కళల్లో ‘టాటూ’లకు విశిష్ట స్థానం ఉందని ఆ పుస్తకాన్ని వెలువరించిన ప్రచురణ సంస్థ చెబుతోంది. కొన్ని బొమ్మలను గణితశాస్త్రం ఆధారంగా తీర్చిదిద్దారని ప్రచురణకర్తలు గొప్పగా చెబుతున్నారు. రంగుల మేళవింపుతో కనువిందు చేసే ఈ బొమ్మలను ‘టాటూ’లుగా వేయించుకోవాలన్న ఉత్సాహం జపాన్ తదితర దేశాల యువతలో ఉరకేలేస్తోందట!