S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

సంక్షిప్త సమాచారం

మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల జీవనశైలిలో చాలా మార్పులు వచ్చాయి. ఉత్తరాలు రాసుకోవడం తగ్గిపోయింది. మాట్లాడుకోవడం ఎక్కువై పోయింది. అవసరం వున్నా లేకున్నా సంక్షిప్త సమాచారాలు ఎస్‌ఎంఎస్ పంపుకునే పరిస్థితి వచ్చింది. సంక్షిప్త సమాచారాల వల్ల కొన్ని సౌకర్యాలు ఉన్నాయి. అనవసరంగా రింగ్ చేసి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉండదు. కొత్తవాళ్లకి విషయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. పరిచయం చేసుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడదు.
సంక్షిప్త సమాచారాల యుగం నుంచి వాట్సప్‌లు, టెలిగ్రామ్‌ల యుగం వచ్చింది. ఏ విషయాన్ని అయినా ఇతరులకు పంపించడం సులువైపోయింది. ఫొటోలు, వీడియోలు తక్షణమే పంపించే వెసులుబాటు లభించింది. ఒక్క క్షణంలోనే వందల మందికి సమాచారం పంపించే సౌలభ్యం కూడా దొరికింది. రకరకాల వీడియోలు, చిన్నచిన్న కథలు, వ్యక్తిత్వ వికాస సుభాషితాలు, కామెంట్లు ఇట్లా ఎన్నో. సోషల్ మీడియా అనేది ఓ సమాంతర మీడియాలాగా అభివృద్ధి చెందుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని విచిత్రమైన సమాచారాలు కూడా మనకి వస్తూ ఉంటాయి. చాలా రోజుల క్రితం నాకు ఓ విచిత్రమైన మెసేజి వచ్చింది. దాని సారాంశం ఏమంటే - ‘ఈ సమాచారాన్ని డెలిట్ చేయకండి. ఈ భగవంతుని గురించిన సమాచారాన్ని 11 మందికి పంపించండి. మీ జీవితంలో అద్భుతమైన సంఘటన జరుగుతుంది. నేను ఈ విధంగా పంపించిన రెండు గంటల్లో ఓ శుభవార్త విన్నాను. మీరు పంపించకపోతే ఓ మూడు సంవత్సరాలు దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది’
ఆ పంపించిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఓ ఐపిఎస్ అధికారి. నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా ఓ 11 మందికి పంపించాలన్న భయం వేసింది. కానీ తొందరగానే తేరుకొని నవ్వుకున్నాను.
దేవుడు కూడా మామూలు మనిషి లాంటి వ్యక్తి అని ఈ సమాచారాలు సృష్టించే వ్యక్తులు భావిస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు దేవున్ని రోజూ పొగుడుతూ ఉంటాం. కానీ దేవుడు అది కోరుకుంటాడా? కానే కాదు. మనకు ఏదో లబ్ధి జరగాలని మనం రోజూ పొగుడుతూ ఉంటాం. దేవుని మీద మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలి. అంతేకానీ భయం ఉండాల్సిన అవసరం లేదు.
మానసికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు ఇలాంటి సమాచారాలను సృష్టించి జనాలకి పంపిస్తూ ఉంటారు. బలహీనత, భయం, ఆశ మనుషులని మళ్లీ మళ్లీ పంపించేలా చేస్తూ ఉంటాయి. వాటిని పాటించడం వల్ల అద్భుతం జరిగినా, జరుగకపోయినా, నష్టమైతే జరుగదు కదా! పంపించకపోతే నష్టం జరిగే అవకాశం ఉంది కదా అని కూడా కొంతమంది పంపిస్తూ ఉంటారు. నాకు మొదట్లో పంపిన అధికారి ఇట్లా అనుకునే పంపించి ఉంటారు.
ఇలాంటి సమాచారాలని సృష్టించిన వ్యక్తులకి కొంత జ్ఞానం ప్రసాదించమని ఆ భగవంతున్ని ప్రార్థించడంకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు.