S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మీ ఆరోగ్యం మీరు అనుకున్నదానికంటే బాగానే ఉంటుంది

వైద్యుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తున్న ఒక వైద్య నిపుణుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. ‘వైద్యుడి సహాయం అవసరమైన చోట వెనువెంటనే హాజరై వైద్య సేవలు అందించాలి. ఆలస్యం చేస్తే ప్రకృతి ఆ రోగి రోగాన్ని తనే నయం చేసేస్తుంది’
ఈ నిపుణుడు తమాషాకి ఇలా సలహా ఇచ్చాడని వైద్యులు అనుకున్నారు. అయితే ప్రతి ఒక్కరికీ ఈ సలహాలోని యధార్థం తెలుసు.
‘రోగాన్ని నయంచేసే స్వభావంగల ప్రకృతి’ అనే గ్రంథంలో ‘గాయం అయిన తరువాత మానడం, అస్వస్థత తరువాత స్వస్థత అనేవి వైద్యుని చికిత్సతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా శరీరమే చేసుకుంటుంది’ అని రాసి ఉంది.
వైద్యుని అవసరం ఎందుకు?
‘వైద్యుని సేవలు అనవసరం’ అనే భావనతో వైద్య నిపుణుడు సలహా ఇవ్వలేదు. వైద్యుడికి తన వైపు నుండి రోగికి ఎటువంటి వైద్యసేవలు అందించాలో పూర్తిగా తెలుస్తుంది. అతని రాకతో రోగిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. ఏ మేరకు మందులు రోగికి అవసరమో వైద్యుడు ఇవ్వడం వలన రోగం నయం అయ్యే సమయం పుంజుకుంటుంది. రోగి అస్వస్థత సమయంలో ఎప్పుడు బెడ్‌రెస్ట్ తీసుకోవాలో, ఎప్పుడు హాయిగా తన పనులు చేసుకోవచ్చునో వైద్యుడు రోగికి చెప్పగల్గుతాడు.
రోగం నయం అయ్యేందుకు అన్ని సమయాల్లోనూ ప్రతిభావంతంగా పనిచేయగల వైద్య చికిత్స విధానాలు వైద్యుడికి తెలుస్తాయి. ఏ వైద్యుడు ఎటువంటి చికిత్స చేసినా కేవలం ప్రకృతి చేసే వైద్య చికిత్సకు అది సహాయకారి మాత్రమే అవుతుంది. వైద్యుడి చికిత్స రోగి కోలుకోవడానికి చురుగ్గా ఉపయోగపడడానికి ఒక ప్రధాన కారణం అతని చికిత్సా శక్తి మీద రోగికి మంచి నమ్మకం ఉండడం వల్ల అతని చెయ్యి పడగానే విచార స్థితి నుండి బయటపడి ఆనందం, సంతోషాల చట్రాల్లోకి వెళ్లిపోవడం.
వైద్య చికిత్స చేయించుకుంటున్నా రోగి తన బలమైన ఆరోగ్య శరీరం శక్తిని దృష్టిలో ఉంచుకోవాలి.
ప్రకటనల జోరు
‘ఐదుగురిలో ఒకరు కేన్సర్ వల్ల తప్పక మరణిస్తున్నారు’ వంటి ప్రకటనలు తరచు మీడియాలో విన్పిస్తూంటాయి. ‘అందులో ఆ ఒక్కరు మీరు కాకుండా ఉండేందుకు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండాలి’ తరచూ శారీరక వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
‘ప్రతి పది మందిలోనూ ఒకరు పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నారని వార్తాపత్రికల్లో ప్రకటించినపుడు ‘నా శారీరక ఆరోగ్యాన్ని పరిరక్షించుకున్నట్లుగానే నా మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటాను.’ ‘ఒకవేళ నాకు అనారోగ్యం ఏర్పడితే చాలా సులువుగా, వేగంగా నేను స్వస్థతకు రాగలను’ అనుకోవాలి. ఈ రోజుల్లో శారీరక ఆరోగ్యాన్ని తిరిగి పొందడం ఎంత సులువుగా ఉందో మానసిక ఆరోగ్యం తిరిగి పొందగల్గడం కూడా అంత అందుబాటులో ఉంది.
భయాన్ని విశ్వాసంతో జయించాలి
విశ్వాసం భయంకన్నా బలమైనది. భయంతో కూడిన ఆలోచనలను త్రోసి విశ్వాసంతో కూడిన ఆలోచనలతో మనసును నింపుకోవాలి. ఈ విశ్వాసం చాలా అంశాలకు వినియోగించుకోవాలి. అది మీలోనే మొదలుకావాలి. మన శరీరంలో మరమ్మతులు చేసే అతి గొప్ప వైద్యుడు ఉన్నాడు.
మన శరీరం సర్దుబాటు శక్తిపై మనకు విశ్వాసం ఉండాలి. మనిషి ఈ భూమి మీద బ్రతకడమే కాదు తన స్థితిని రోజురోజుకు బలపరచుకుంటున్నాడు. భయం ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మార్పు చేస్తుంది. విశ్వాసం అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చగల్గుతుంది.
ఐదు కారణాలు
మనిషి తను అనుకున్న దానికన్నా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాడనే దానికి ఐదు కారణాలు ఉన్నాయి. అవి ప్రకృతి ఔదార్యం, మన శరీర స్థిర ఉష్ణోగ్రత, మన శరీరంలోని సహజ సిద్ధమైన రక్షక వ్యవస్థ, మన శరీరంలో చాలినంత నిల్వ సౌకర్యాలు, శరీరంలోని ప్రవాహి ప్రసరణ రక్షక సామర్థ్యం.
ప్రకృతి ఔదార్యం
శరీరంలోని నిర్మాణాలు, పనితీరు రక్షక హద్దుకు ప్రతిబింబాలుగా ఉండడమే ప్రకృతి ఔదార్యం. ప్రకృతి ప్రసాదించిన వరం ఏమిటంటే మన శరీరం చక్కగా పనిచేసేందుకు కావలసిన అవసరాలను తగినంత మాత్రంగాక సమృద్ధిగా అందుబాటులో ఉండేటట్లు చేయడం. తమాషా ఏమిటంటే మన శరీరంలో పలు అవయవాలు జతలు జతలుగా ఉంటాయి. ఇందులో ఒకటి చెడిపోయినా మరొక దాని ఆసరాతో హాయిగా జీవించవచ్చు.
శరీరంలో గుండె ఒకటే వున్నప్పటికీ అవసరమైతే అది రెట్టింపు వేగంతో ఏ విధమైన ప్రమాదం లేకుండా పని చేయగలదు. గుండె కండరాలను తిరిగి నిర్మించుకోగలదు.
‘కరోనరి త్రాంబసిస్’కి తగిన కాలం విశ్రాంతి లభిస్తే గుండె కండరాలు తిరిగి నిర్మించుకుంటాయని’ ఒక ప్రముఖ హృద్రోగ చికిత్సా నిపుణుడు వైద్య సదస్సులో తెలియజేశాడు.
అనుకూల దృక్పథం రోగం నయం కావడానికి ఎంతో సహకరిస్తుంది.
నిల్వ సౌకర్యాలు
మన శరీరంలో అవసరానికి కావలసిన పదార్థాలు, అత్యయిక పరిస్థితులలో విడుదలయ్యేందుకు ఆ పదార్థాలు తగినంతగా నిల్వ ఉండే సౌకర్యాలు ఉన్నాయి. ఆరోగ్యమైన శరీరంలో కావలసినంత గ్లూకోజ్, ఇతర పదార్థాలు అవసరం మేరకు ఉంటాయి. శరీరంలో సందిగ్ధ స్థితి ఏర్పడినపుడు శరీరంలో నిల్వ వున్న ఈ పదార్థాలు విడుదలయి రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా రవాణా కాబడి శరీరాన్ని కాపాడుతాయి.
శరీరానికి తనను తాను రక్షించుకునే అద్భుతమైన ఇటువంటి వ్యవస్థలు వున్న కారణంగానే మనమంతా ఆరోగ్యం విషయంలో అపర భాగ్యవంతులం.

-సి.వి.సర్వేశ్వరశర్మ