S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హెన్రీఫోర్డ్ (ప్రముఖ శాస్తవ్రేత్తలు)

కార్ల తయారీ రంగంలో ప్రఖ్యాతి చెందిన ఫోర్డ్ కేవలం స్వశక్తిపై విశ్వాసాన్ని పెంచుకుని అద్భుతమైన విజయాలు సాధించాడు. హెన్రీఫోర్డ్ 1863 జులై 30న అమెరికాలోని డియర్‌బోర్న్‌లో జన్మించాడు. ఫోర్డ్‌కి చిన్నతనం నుంచీ ‘వస్తువులు ఎలా పని చేస్తున్నాయి?’ అనే విషయంపైన ఎక్కువగా ఆసక్తి ఉండేది. అతనిని ప్రోత్సహించే మిత్రుడు రాడిమన్ ‘నీకు వచ్చే ప్రతి ఆలోచనను పేపర్ మీద పెట్టు’ అంటూ ఉత్సాహపరిచాడు.
చదువు మానేసి ఫోర్డ్ ఒక గడియారాలు రిపేరు చేసే షాపులో పనికి చేరాడు. అక్కడ గడియారాలలోని భాగాలు ఎలా పని చేస్తున్నాయో తెలుసుకున్నాడు. నలుగురు కూర్చొని సరదాగా తిరిగే వాహనం కనిపెట్టాలనే ఆలోచన రోజురోజుకీ అతనికి ఉధృతమవసాగింది. ఆ సమయంలో ‘వరల్డ్ ఆఫ్ సైన్స్’ అనే పత్రికలో డా.నికోలస్ ఓటో అనే జర్మనీ శాస్తజ్ఞ్రుడు రాసిన ‘కంబస్టన్ ఇంజన్’ అనే వ్యాసం చదివాడు. అది అతని పరిశోధనలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది.
16 ఏళ్ల వయసులో ఉద్యోగం వేటలో డెట్రాయిట్ వచ్చి అక్కడొక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని, ముందు గదిలో తాను ఉంటూ వెనుక గదిలో పరిశోధనలు ప్రారంభించాడు. అప్పటికే జర్మనీలో బెంజ్ వంటి ప్రముఖులు కూడా కారు కనిపెట్టే యత్నాల్లో ఉన్నారు.
అప్పటికే ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీలో అనేక ప్రయోగాలు ఆరంభమయ్యాయి. స్వశక్తితో కృషిచేసిన ఫోర్డ్ 1893లో మొట్టమొదటి కారును తయారుచేశాడు. కానీ ఉద్యోగం ఊడింది. అయినా చలించక ఒక కంపెనీ స్థాపించి, రేసు కార్లను ఉత్పత్తి చేయాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతని భార్య ఎంతో సహకరించింది. మొత్తం పొలాన్ని అమ్మి డబ్బు తెచ్చింది. వారు ఫోర్డ్ మోటారు కంపెనీ స్థాపించి ఎంతో విశ్వాసంతో కార్ల ఉత్పత్తి ప్రారంభించారు. అతితక్కువ సమయంలోనే ఫోర్డ్ కార్లకు మంచి పేరు వచ్చింది. డిమాండ్ కూడా పెరిగింది. 1910 నాటికి మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగారు. 1927 నాటికి నూట ఇరవై కోట్ల కార్లను తయారుచేసి రికార్డు సృష్టించారు. తన యావదాస్తిని దేవ సంక్షేమ కార్యక్రమాలకై వినియోగించడానికి ఫోర్డ్ ఫౌండేషన్ ట్రస్టుకి విరాళం ఇచ్చి 1947 ఏప్రిల్ 7న స్వర్గస్థుడయ్యాడు. ఇప్పటికే కార్ల ప్రపంచంలో అగ్రగణ్యుడు హెన్రీ ఫోర్డ్ కావడం విశేషం.

P.V.RAMANAKUMAR