S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

చరిన్‌కానియన్

ఖజకిస్థాన్‌కీ తూర్పు చైనాకీ ఆనుకొని వున్న అతి లోతైన పర్వత కనుమ చరిన్ కానియన్. ఈ లోయ అమెరికన్ గ్రాండ్ కానియన్‌ను తలపిస్తుంది. ఎన్నో రంగులు పేర్చిన గుహగా దర్శనమిస్తుంది. అడుగున భూకంపం వల్ల వచ్చి ఏర్పడిన రాతి గుట్టల పైభాగంలో ఎర్రని రాళ్లు , బూడిద రాళ్లు కలిపిన కొండ చరియలు ఉంటాయి. మనం దగ్గర నుండి చూస్తే ఈ ప్రాంతం ఒక ఎడారిలా, నదీ ప్రవాహం వల్ల ఇక్కడ ఒక ఒయాసిస్సు ఏర్పడినట్లు కన్పిస్తుంది. ఈ కనుమలో చెట్లు, జంతుజాలం ఉండే అవకాశం లేదు.
సాహస ప్రయాణీకులు ఈ కనుమ అడుగు భాగం వరకూ వెళ్లవచ్చు. 90 మీటర్ల లోతు నుండి 300 మీటర్ల లోతు వరకూ కొండ చరియలను చూడవచ్చు. ఈ గోడలలో ఎన్నో శిలాజాలాలను గమనించవచ్చు. వేసవికాలంలో ఈ నదిలో దిగవచ్చు. కాని అప్పుడు తీవ్రమైన ఉష్ణోగ్రత ఉంటుంది.

-బి.మాన్‌సింగ్ నాయక్